Salman Khan: భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌కు చిరంజీవి, రితీష్ దేశ్‌ముఖ్ వంటి సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. కానీ, బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ల మౌనం విమర్శలకు దారితీసింది. అక్షయ్ కుమార్ తప్ప మిగతా స్టార్స్ నుంచి ఆపరేషన్ సిందూర్‌పై ఎలాంటి స్పందనా రాలేదు.
సల్మాన్ ఖాన్ మాత్రం మే 10న భారత్-పాకిస్తాన్ సీజ్‌ఫైర్ ఒప్పందంపై “Thank God for the ceasefire” అని ట్వీట్ చేసి, తర్వాత డిలీట్ చేశారు. దీనిపై నెటిజన్స్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సిందూర్‌పై మౌనంగా ఉండి, సీజ్‌ఫైర్‌పై స్పందించడం దేశభక్తిని ప్రశ్నించేలా ఉందని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో #BoycottSalmanKhan ట్రెండ్ కాగా, సల్మాన్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ వివాదం బాలీవుడ్ స్టార్స్ బాధ్యతపై మరోసారి చర్చ రేపింది.

