Arijit Singh

Arijit Singh: ఇకపై అరిజిత్ పాటలు వినలేమా? కెరీర్ పీక్ స్టేజ్‌లో స్టార్ సింగర్ సంచలన నిర్ణయం!

Arijit Singh: ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అరిజిత్ సింగ్ తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. తన మధురమైన గొంతుతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఆయన, తాజాగా ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అరిజిత్ సింగ్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది.

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అరిజిత్ ఒక సుదీర్ఘమైన సందేశాన్ని రాసుకొచ్చారు. ఇన్నేళ్లుగా శ్రోతలు తనపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఇకపై కొత్త సినిమా ప్రాజెక్టులు ఏవీ ఒప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే, ఇది తన ప్రయాణానికి ముగింపు కాదని, ఒక చిన్న కళాకారుడిగా మరిన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ తన సొంతంగా సంగీతం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఒప్పుకున్న కొన్ని పెండింగ్ పాటలను ఈ ఏడాది పూర్తి చేస్తానని, కాబట్టి తన నుంచి మరికొన్ని పాటలు వినే అవకాశం ఉంటుందని ఆయన అభిమానులకు హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Hyderabad: గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్

అరిజిత్ సింగ్ కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, బెంగాలీ, తమిళ భాషల్లో కూడా ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. తెలుగులో ‘కేడీ’, ‘స్వామి రారా’, ‘ఉయ్యాల జంపాల’, ‘నీ జతగా నేనుండాలి’, ‘కేశవ’, ‘హుషారు’ మరియు ఇటీవల వచ్చిన ‘ఓం భీమ్ బుష్’ వంటి సినిమాల్లో ఆయన పాడిన పాటలు శ్రోతలను ఎంతగానో అలరించాయి.

ఇటీవలే సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘బాటిల్ ఆఫ్ గల్వాన్’ చిత్రం కోసం ఆయన పాడిన ‘మాతృభూమి’ అనే పాట విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. హిమేష్ రేషమ్మియా సంగీతం అందించిన ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కానుంది. ప్లేబ్యాక్ సింగింగ్ ఆపేసినప్పటికీ, సంగీతంతో తన ప్రయాణం మాత్రం కొనసాగుతుందని అరిజిత్ చెప్పడం ఆయన అభిమానులకు కొంత ఊరటనిచ్చే విషయమే.

 

View this post on Instagram

 

A post shared by Arijit Singh (@arijitsingh)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *