Blood: అవధూత గోపాల్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘బ్లడ్’. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయడం విశేషం. గతంలో ‘డేంజర్ లవ్ స్టోరీ’తో పాటు పలు చిత్రాలను ఆయన నిర్మించారు. తాజా చిత్రం ‘బ్లడ్’లో గౌరవ్ హీరోగా నటించగా, గోపాలరావు, నందినీ కపూర్, ‘జబర్దస్త్’ వినోదిని, రాకింగ్ రాకేశ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఇదే నెల 27న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ రచ్చ!
Blood: ఈ కార్యక్రమానికి దర్శకుడు రేలంగి నరసింహారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘జబర్దస్త్’ అప్పారావు, నటుడు విజయ భాస్కర్ మూవీ ప్రోమోస్ ను ఆవిష్కరించారు. ఇతర నటీనటులు ఐటమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. నేటికి ట్రెండ్ కు తగ్గట్టుగా రూపుదిద్దున్న మర్డర్ మిస్టరీ, హారర్ మూవీ ఇదని, ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని గోపాల్ అన్నారు