హర్యానా ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి. ఎగ్జిట్‌పోల్స్‌కు భిన్నంగా బీజేపీ దూసుకు వచ్చింది. 48 చోట్ల ముందంజలో ఉన్న బీజేపీ.. మ్యాజిక్ ఫిగర్ ను చేరింది. మొదట ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. బీజేపీ ఒక్కసారిగా తన హవా చూపింది.
కాంగ్రెస్ నేత భూపేందర్ సింగ్ మాట్లాడుతూ హర్యానాలో అధికారం చేపడతాం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. రాహుల్, ఖర్గే నాయకత్వంలో విజయం సాధించబోతున్నాం.. చివరి రౌండ్ కంటే ముందే స్పష్టమైన మెజార్టీ సాధిస్తామని తెలిపారు.