BJP:

BJP: తెలంగాణ బీజేపీకి గుడ్‌న్యూస్‌.. రాష్ట్ర అధ్య‌క్షుడి ఎన్నిక‌పై అప్‌డేట్‌

BJP: ఎన్నాళ్లుగానే ఎదురు చూస్తున్న తెలంగాణ బీజేపీ క్యాడ‌ర్‌కు శుభ‌వార్త అందింది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న జీ కిష‌న్‌రెడ్డికి కేంద్ర మంత్రి వ‌ర్గంలో స్థానం దొరికిన నాటి నుంచి మ‌రో నేత‌ను అధ్య‌క్షుడిగా నియ‌మిస్తార‌ని ఏడాదికి పైగా ఆ పార్టీ అధిష్ఠానం ఊరిస్తూ వ‌చ్చింది. ఎవ‌రు రాష్ట్ర అధ్య‌క్షుడు అవుతార‌నే విష‌యంలో అటు బీజేపీలో, ఇత‌ర పార్టీల్లో కూడా తీవ్ర ఉత్కంఠ‌కు దారితీసింది. తాజాగా బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర అధ్య‌క్షుడి ఎన్నిక‌పై కీల‌క స‌మాచారం ఇవ్వ‌డంతో ఆ పార్టీ క్యాడ‌ర్‌లో జోష్ నిండుకున్న‌ది.

BJP: కిష‌న్‌రెడ్డి త‌ర్వాత ఎవ‌రు అధ్యక్షుడు అనే విష‌యంలో బీజేపీలో పోటాపోటీ చ‌ర్చ జ‌రిగింది. బీసీ నేత‌ను అధ్య‌క్షుడిని చేస్తారంటూ తీవ్ర ప్ర‌చారం జ‌రిగింది. ఆ విష‌యంలో ఈట‌ల రాజేంద‌ర్‌కు రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తార‌ని, పార్టీ క్యాడ‌ర్‌లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జ‌రిగింది. అదే స్థాయిలో మెద‌క్ ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ డీకే అరుణ‌, మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ పేర్ల‌పైనా ప్రచారం జ‌రిగింది.

BJP: ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ అధిష్ఠానం కీల‌క అప్‌డేట్ ఇవ్వ‌డంతో మరింత ఉత్కంఠ‌కు దారితీసింది. జూలై ఒక‌టిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడి ఎన్నిక ఉంటుంద‌ని ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ మేరకు జూన్ 29న రాష్ట్ర అధ్య‌క్షుడి ఎన్నికకు నోటిఫికేష‌న్ విడుద‌ల అవుతుంది. ఇదే నెల 30న నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తార‌ని ఆ పార్టీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

BJP: ఇది కేవ‌లం ఫార్మాలిటీ మాత్ర‌మేనని, బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర అధ్య‌క్షుడి విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింద‌ని స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్న బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తూ వ‌స్తున్న‌ది. అంద‌రినీ స‌మ‌న్వ‌యం చేసే వ్య‌క్తికే అధ్య‌క్ష ప‌ద‌విని క‌ట్ట‌బెట్టాల‌ని ఆ పార్టీ భావిస్తున్న‌ది. విభేదాలు ఉంటే ప‌క్క‌న పెట్టాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యం కావాల‌ని ఆ పార్టీ కీలక నేత‌ల‌కు అధిష్టానం ఆదేశించింద‌ని తెలిసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *