House Arrest: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ఎదుట భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు చర్యగా పలువురు కీలక బీజేపీ నాయకులను గృహనిర్బంధం (House Arrest) చేశారు. తార్నాకలోని తన నివాసం వద్ద టీ.బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకుని హౌస్ అరెస్ట్ చేయగా, అటు సీఎం ఇంటి ముట్టడికి వెళ్లకుండా ఇతర ముఖ్య నేతలను కూడా ఎక్కడికక్కడ నిలువరించారు. మహిళా సాధికారతకు అడ్డుపడటం కాంగ్రెస్ నైజమని బీజేపీ విమర్శిస్తుండగా, ఈ హౌస్ అరెస్ట్ లు ప్రస్తుతం నగరంలో రాజకీయ ఉత్కంఠను రేపుతున్నాయి.
