Bird Flu:గత కొంతకాలం క్రితమే తగ్గిన బర్డ్ ఫ్లూ వ్యాధి మళ్లీ దేశంలో వ్యాపిస్తున్నది. ఈ వ్యాధి సోకితే పెద్ద కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంటుంది. గతంలో పెద్ద ఎత్తున కోళ్ల ఫారాల్లో వేలాది కోళ్లకు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకితే షెడ్లల్లోనే మృత్యువాత పడ్డాయి. దీంతో కోళ్ల పెంపకందారులు పెద్ద ఎత్తున నష్టాలపాలయ్యారు. ఆ వ్యాధి నివారణకు దేశవ్యాప్తగా వ్యాక్సిన్లు వాడటంతో కొంత నివారణ కలిగింది.
Bird Flu:అయితే మళ్లీ ఇటీవల దేశంలో బర్డ్ ఫ్ల్యూ వ్యాధి కోళ్లకు సోకుతున్నట్టు వార్తలు అందుతున్నాయి. ముఖ్యంగా కేరళలోని అలప్పుళ, కొట్టాయం జిల్లాలో అవైన్ ఇన్ ఫ్లుయెంజా వైరస్ కోళ్లకు సోకినట్టు గుర్తించారు. దీని కట్టడికి ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆ వ్యాధి విస్తరించకుండా ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ముందస్తు వ్యాక్సిన్ చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.
Bird Flu:బర్డ్ ఫ్ల్యూ వ్యాధి తమ రాష్ట్రంలోకి వ్యాపించకుండా తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలోని నీలగిరి, కోయంబత్తూరు సహా కేరళ సరిహద్దు జిల్లాల్లో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటుచేసింది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని కోళ్ల తరలింపు వ్యాన్లను వెటర్నరీ బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి.
