Hyderabad

Hyderabad: జేబీఎస్ వద్ద బస్సు బీభత్సం.. బైక్‌తో సహా కింద ఇరుక్కుపోయిన వాహనదారుడు

Hyderabad: సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టాండ్ (JBS) సమీపంలో బుధవారం ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో, బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి అదుపుతప్పి నేరుగా బస్సు కిందికి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో బైక్‌తో సహా ఆ వాహనదారుడు బస్సు చక్రాల కింద ఇరుక్కుపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రయాణికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న మారేడ్‌పల్లి పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. బస్సు కింద ఇరుక్కుపోయిన క్షతగాత్రుడిని, అతడి బైక్‌ను బయటకు తీయడానికి పోలీసులు, బాటసారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చాలా సేపు కష్టపడి ఎట్టకేలకు అతడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

బస్సు కింద ఇరుక్కుపోయినప్పటికీ, ఈ ప్రమాదంలో వాహనదారుడికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *