Karnataka: కర్ణాటక రాష్ట్రంలో ఓలా, ర్యాపిడో, ఊబర్ వంటి సంస్థలు నడుపుతున్న బైక్ ట్యాక్సీ సేవలకు ప్రభుత్వం నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనివల్ల వేలాది మంది బైక్ రైడర్‌లు తమ ఉపాధిని కోల్పోనుండటంతో ఆందోళనలు చెలరేగుతున్నాయి.
ప్రభుత్వ నిర్ణయంపై బైక్ రైడర్‌లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇది ప్రధాన ఆదాయ వనరు అని, ఇప్పుడు తమ బతుకుతెరువుకు కష్టం అవుతుందని వాపోతున్నారు. మరోవైపు, నగరాల్లో ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉన్న ఈ బైక్ ట్యాక్సీలు నిషేధంతో ప్రజలకు ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నిషేధానికి కారణం :
బైక్ ట్యాక్సీలను నిషేధించడానికి ప్రధాన కారణం, వాటికి చట్టబద్ధత లేకపోవడమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. 1988 మోటారు వాహన చట్టం ప్రకారం, ద్విచక్ర వాహనాలను వాణిజ్య అవసరాలకు అనుమతించరు. ఓలా, ర్యాపిడో వంటి సంస్థలు ప్రైవేట్ రిజిస్ట్రేషన్ కలిగిన బైక్‌లను వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నాయని రవాణా శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.
Also Read: KTR: జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు
Karnataka: అంతేకాకుండా, బైక్ ట్యాక్సీలకు ఛార్జీల నియంత్రణ, ప్రయాణీకుల భద్రత, బీమా వంటి నిబంధనలు లేకపోవడం కూడా ఆందోళనకు దారితీసింది. ఈ అంశాలపై పూర్తి స్పష్టత లేకపోవడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ నిషేధంపై ఓలా, ర్యాపిడో వంటి కంపెనీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల తమ సేవలు ప్రభావితం అవుతాయని, తమ వ్యాపారం దెబ్బతింటుందని పేర్కొంటున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.