Bigg Boss Telugu 9

Bigg Boss Telugu 9: షాక్ ఇచ్చిన బిగ్ బాస్.. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు అవుట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పదో వారం వీకెండ్ ఎపిసోడ్ (69వ రోజు) ఊహించని ట్విస్టులు, తీవ్ర భావోద్వేగాల సునామీతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది. హోస్ట్ కింగ్ నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’ పాటతో ఎంట్రీ ఇచ్చి, హౌస్‌మేట్స్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఈ వారం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించడంతో పాటు, ‘నో ఫ్యామిలీ వీక్’ అనే మరో పెద్ద బాంబ్ వేసి బిగ్ బాస్ హౌస్‌ను షేక్ చేశారు.

నాగార్జున ‘కత్తులు – క్లాప్స్’ : ఎవరికి అక్షింతలు, ఎవరికి మందలింపులు?

వారం రోజులు జరిగిన ఆట తీరుపై నాగార్జున ‘కత్తులు – క్లాప్స్’ కాన్సెప్ట్‌తో హౌస్‌మేట్స్‌కు వారి పర్ఫార్మెన్స్ గురించి వివరించారు.కొత్త కెప్టెన్ తనూజను అభినందించినప్పటికీ, డీమోన్ పవన్‌తో గొడవ విషయంలో ఆమె వ్యవహరించిన తీరుపై నాగ్ తీవ్రంగా మందలించారు. “బుర్ర లేకుండా హౌస్‌లో ఆడపిల్లని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడనే నిందలు వేయొద్దు కదా?” అంటూ ఆమె కత్తిని విరగ్గొట్టారు.

సంచాలక్‌గా రీతూ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలపై నాగార్జున పైర్ అయ్యారు. ఇక నుంచి రీతూని సంచాలక్‌గా పెట్టకండి… ఇష్టం వచ్చినట్లు రూల్స్ మార్చేస్తావ్ అంటూ ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. సుమన్ శెట్టి – సంజన టవర్ టాస్క్‌లో కల్యాణ్ తీసుకున్న నిర్ణయం సరైనదే అయినా, సరైన వివరణ ఇవ్వనందుకు అతడిని  ‘ఫెయిల్డ్ సంచాలక్’గా ప్రకటించి కత్తి విరిచేశారు.

భరణి, ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి కామెడీ టైమింగ్‌కు నాగ్ నుంచి ప్రశంసలు దక్కాయి. గత వారం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నిఖిల్ నాయర్ని కూడా నాగ్ అభినందించారు.

సంజన గుండె పగిలింది: ‘నో ఫ్యామిలీ వీక్’ షాక్

హౌస్‌మేట్స్‌కు రెండు బిగ్ బాంబ్స్ ఉన్నాయంటూ ప్రకటించిన నాగార్జున, ‘ముంచేది తేల్చేది’ టాస్క్‌తో రెండో బాంబ్ ఎవరిపై పడుతుందో నిర్ణయించారు. ఈ టాస్క్‌లో నలుగురు ఇంటి సభ్యులు తమ ఆట తీరు సంజన వల్లే కిందకి పోతుందని పేరు చెప్పారు. దీంతో, ఆ రెండో బాంబ్ సంజనపై పడింది.

ఇది కూడా చదవండి: Bihar: బీహార్‌లో మళ్లీ నితీష్ రాజ్యం.. ఈ తేదీల్లో నే ప్రమాణ స్వీకారం!

ఆ బాంబు తెరచి చూడగా అందులో ‘నో ఫ్యామిలీ వీక్’ అని రాసి ఉండటంతో సంజన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. “సార్ నేను ఇంటికెళ్లిపోతాను సార్.. నా వల్ల కాదు.. నేను చచ్చిపోతా” అంటూ ఆమె గుక్కపెట్టి ఏడ్చింది. ఫ్యామిలీ వీక్‌లో తన భర్త, పిల్లలను చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సంజనకు ఈ షాక్ తీరని బాధ కలిగించింది. అయినప్పటికీ, ఇది మెజారిటీ హౌస్‌మేట్స్ నిర్ణయమని, బిగ్ బాస్‌లో ఊహించనివి జరుగుతాయని నాగార్జున ఆమెకు నచ్చజెప్పారు.

డబుల్ ఎలిమినేషన్: నిఖిల్ అవుట్, గౌరవ్ కూడానా?

నామినేషన్స్‌లో ఉన్న వారందరినీ గార్డెన్ ఏరియాకు పిలిచిన నాగార్జున, ఫిష్ బౌల్స్‌లో బాటిల్ లిక్విడ్ పోసే ప్రక్రియలో చివరగా నిఖిల్ నాయర్‌ను ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. నిఖిల్ నాయర్ హౌస్ నుంచి బయటకు రాగానే సంజన తీవ్రంగా ఎమోషనల్ అయింది. స్టేజ్ మీదకు వచ్చిన నిఖిల్‌ను నాగార్జున అభినందించారు. హౌస్‌మేట్స్ గురించి చెబుతూ… తనూజలో ఏడుపు, రీతూలో కన్ఫ్యూజన్, దివ్యలో ఓవర్ కమాండింగ్, భరణిలో సైలెన్స్ నచ్చవని చెప్పి నిఖిల్ గుడ్‌బై చెప్పాడు.

గ్రాండ్ ఫినాలేకు మరో నాలుగు వారాల సమయమే ఉండగా, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పక్కా అని నాగార్జున శనివారం నాటి ఎపిసోడ్‌లోనే వెల్లడించారు. సోషల్ మీడియాలో లీక్ అవుతున్న సమాచారం ప్రకారం, నిఖిల్ తర్వాత గౌరవ్ కూడా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.ఈ వారం ప్రతి టాస్కులో నిఖిల్ ఇరగదీసినప్పటికీ ఎలిమినేట్ కావడం ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. టఫ్ ఫైట్ ఉన్న దివ్యను సేవ్ చేసేందుకు నిఖిల్‌ను పంపించారని కొందరు ఆడియన్స్ వాదిస్తున్నారు. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన వాళ్లంతా ఎలిమినేట్ అవుతుండటం గమనార్హం.మొదటి వారమే రాము సెల్ఫ్ ఎలిమినేట్ కాగా, సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు నిఖిల్, గౌరవ్ కూడా బయటకు వెళ్లడంతో హౌస్‌లో గేమ్ మరింత రసవత్తరంగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *