Big Boss Akhil

Big Boss Akhil:‘వేరే లెవెల్ ఆఫీస్’ అంటున్న అఖిల్!?

Big Boss Akhil: తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్4’లో రన్నరప్ గా నిలిచాడు అఖిల్. అయితే బిగ్ బాస్ తో వచ్చిన ఫేమ్ అతగాడి కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. అప్పుడప్పుడు సినిమాల్లో అలా మెరుస్తూ పోతున్న అఖిల్ తాజాగా ఓ వెబ్ సీరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఆ వెబ్ సీరీస్ ‘వేరే లెవల్ ఆఫీస్’. ఒక్కొక్కరు ఒక్కో ఆణిముత్యం అనేది దానికి ట్యాగ్ లైన్. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సీరీస్ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో ఈ నెల 28 నుంచి ఈ సీరీస్ స్ట్రీమింగ్ కానుందట. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ వెబ్ సీరీస్ లో అఖిల్ సార్ధక్ తో పాటు మమేశ్ విట్టా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, యూట్యూబ్ స్టార్స్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఈ వెబ్ సీరీస్ 50కి పైగా ఎసిసోడ్స్ తో రానుందట. తమిళంలో రూపొంది విజయవంతమైన ‘వేరే మారి ఆఫీస్’ కు ఇది రీమేక్. తమిళ ‘ఆహా’లో ప్రస్తుతం ఈ సీరీస్ సెకండ్ సీజన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. సాప్ట్ వేర్ ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగుల జీవితం ఆధారంగా ఈ వెబ్ సీరీస్ తెరకెక్కింది. మరి సీరీస్ తెలుగులోనూ నవ్వుల పువ్వులు పూయిస్తుందేమో చూడాలి. 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Health: కొబ్బరి చట్నీ వల్ల మస్తు ఉపయోగాలు.. అవేంటో తెలుసా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *