UPI Payments

UPI Payments: ఇలా అయితే.. ఏప్రిల్ 1 నుంచి మీ ఫోన్ నుంచి పేమెంట్స్ చేయలేరు.. మీ నెంబర్ చెక్ చేసుకోండి!

UPI Payments: మీరు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా ట్రాన్సక్షన్స్ చేస్తుంటే మీ కోసం ఒక ముఖ్యమైన అప్ డేట్ ఉంది. బ్యాంకుకు లింక్ చేసిన మీ మొబైల్ నంబర్ చాలా కాలం పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే, వెంటనే దాన్ని యాక్టివేట్ చేసుకోండి. లేకపోతే, పేమెంట్స్ చేయడంలో మీరు ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే, ఏప్రిల్ 1 నుండి, UPI పేమెంట్ సర్వీస్ కు సంబంధించిన కొత్త నియమం అమలు కానుంది.

చాలా కాలంగా యాక్టివ్‌గా లేని లేదా క్లోజ్ చేసిన తర్వాత తిరిగి యాక్టివేట్ అయిన బ్యాంక్ ఎకౌంట్స్ కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. వాటిని UPI వ్యవస్థ నుండి తొలగిస్తారు. ఈ మార్పు పాత లేదా క్లోజ్డ్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన వినియోగదారులను ప్రభావితం చేస్తుంది.

UPI ని నియంత్రించే సంస్థ అయిన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), అటువంటి మొబైల్ నంబర్‌లను డీలింక్ చేయాలని బ్యాంకులు, పేమెంట్ గేట్ వే లను ఆదేశించింది. అంతేకాకుండా NPCI త్వరలో పుల్ ట్రాన్సక్షన్ ఫీచర్‌ను కూడా నిలిపివేసే అవకాశం ఉంది.

సైబర్ మోసాలను అరికట్టడానికి..
సైబర్ మోసం, అనధికార లావాదేవీలను నిరోధించడానికి NPCI ఈ నిర్ణయం తీసుకుంది. చాలా సార్లు, ఒక మొబైల్ నంబర్ క్లోజ్ అయిన తర్వాత, టెలికాం కంపెనీలు దానిని వేరే వినియోగదారులకు కేటాయిస్తాయి. అటువంటి పరిస్థితిలో, పాత నంబర్‌తో అనుసంధానించిన బ్యాంక్ ఎకౌంట్స్ విషయంలో మోసం జరిగే ప్రమాదం పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: Virat kohli: ఈ సాలా కప్ నామ్దే అని చెప్పకండి… విరాట్ కోహ్లీ స్వీట్ వార్నింగ్

ఈ కారణంగా, ప్రతి వారం యాక్టివ్ గా లేని మొబైల్ నంబర్‌లను గుర్తించి, వాటిని వారి సిస్టమ్ నుండి తొలగించాలని NPCI బ్యాంకులు, Google Pay, PhonePe, Paytm వంటి UPI యాప్‌లను ఆదేశించింది. దీని అర్థం మీ నంబర్ ఎక్కువ కాలం యాక్టివ్‌గా లేకపోతే, అది బ్యాంక్ రికార్డుల నుండి ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోవచ్చు.

అలర్ట్ మెసేజ్..

UPI సర్వీస్ నిలిచిపోవడం గురించి వినియోగదారులకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. అలర్ట్ వచ్చిన తరువాతగా కూడా మొబైల్ నంబర్ ఇనాక్టివ్ గా ఉంటే, దానిని UPI వ్యవస్థ నుండి డిలీట్ చేసేస్తారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *