Bhatti vikramarka: ఖమ్మం జిల్లాలో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు

Bhatti vikramarka: ఖమ్మం జిల్లాలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. కోడుమూరు వందనం ఎత్తిపోతల పథకం రెండో దశకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతానికి నీరు అందించేలా మాట ఇచ్చామని, దాని కోసం దగ్గరుండి మొదటి దశ పనులను పూర్తిచేసామని భట్టి విక్రమార్క తెలిపారు. రెండో దశలో మరో 2,500 ఎకరాలకు నీరు అందించే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు చెప్పారు.

రైతులకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా ఇళ్లను ఒకేసారి మంజూరు చేశామని తెలిపారు. ప్రతి వారం బిల్లులను చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *