Pakistan: పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ ఘనంగా ప్రారంభమైంది. అయితే, ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు భారత జట్టు ఆ దేశానికి వెళ్లలేదు. దీనివల్ల, భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
అయితే, పాకిస్థాన్ గడ్డపై భారత జాతీయ గీతం వినిపించడం ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.