NRI Husband Harassment

NRI Husband Harassment: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైకో NRI భర్త… ఫ్రెండ్లీగా విడిపోదామంటూ

NRI Husband Harassment: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైకో NRI భర్త వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుని, ఏడాదిన్నర కాపురం చేశాక ముఖం చాటేసాడు భర్త. ఫ్రెండ్లీగా విడిపోదాం, లైఫ్‌ ఎంజాయ్ చేద్దాం అంటూ ఉచిత సలహాలు ఇచ్చాడు. గత 8 నెలలుగా భర్త కోసం భార్య న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. 2023 జూన్ లో నవీన్‌ రెడ్డికి హైదరాబాద్‌లోని చెంగిచెర్లకు చెందిన దుబ్బాక శ్రావ్యతోపెళ్లి కాగా, 55 తులాల బంగారం, 10 లక్షల కట్నం కింద ఇచ్చారు బాధితురాలి కుటుంబ సభ్యులు. బట్టతల ఉన్న విషయం దాచి విగ్గుతో పెళ్లిలో మ్యానేజ్ చేశాడు నవీన్ రెడ్డి. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు అమెరికాలోని డల్లాస్‌లో వీరి కాపురం సాగింది.

2024లో వీసా స్టాంపింగ్ ఉందని భార్యను ఇండియాకు పంపి..భార్య వీసా క్యాన్సిల్ చేయించాడు నవీన్ రెడ్డి. సుమారు ఏడాది గడిచినా నవీన్‌రెడ్డి శ్రావ్యను తిరిగి అమెరికాకు తీసుకెళ్లలేదు. దీంతో బాధితురాలు కుటుంబం ఇల్లందు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇదే కేసులో అబ్బాయి తల్లిదండ్రులతో దురుసుగా.. ప్రవర్తించాడంటూ సీఐని సస్పెండ్‌ చేశారు ఉన్నతాధికారులు. ఈ వివాదంపై ఎన్నారై భార్య, బాధితురాలు శ్రావ్య స్పందించారు. పోలీసు ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు పోలీసులు మద్దతుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో విచారణ జరుపుతున్న ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణను సస్పెండ్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.

ఇది కూడా చదవండి: UPI Payments: మ‌రింత వేగంగా యూపీఐ సేవ‌లు.. కేవ‌లం 15 సెక‌న్ల‌లోనే లావాదేవీలు పూర్తి

తనలో ఎలాంటి లోపం లేదని వైద్యులు , భర్తకు పరీక్షలు నిర్వహించాలని సూచించినా.. అత్తింటివారు తనపైనే నిందలు వేస్తున్నా్రని, తనని మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ శ్రావ్య వాపోయింది. పోలీసు కౌన్సిలింగ్‌కు కూడా రాకుండా తప్పించుకుంటున్న తన భర్తను అమెరికా నుంచి రప్పించి తనకు న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: సీఎం రేవంత్ దండయాత్ర... తగ్గిన పుష్ప.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *