Best Song 2024: 2024 ముగిసింది. ఈ ఏడాది టాలీవుడ్ సినిమాల్లో కొన్ని మ్యూజికల్ గానూ ఆడియన్స్ లో బలమైన ముద్ర వేశాయి. మొత్తంగా చూస్తే మన సినిమాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి. అవి మిలియన్ వ్యూస్ తో మాత్రమే కాదు రీల్స్ లోనూ దుమ్ము రేపాయి. స్టార్స్ సినిమాల్లో పాటలు రిలీజ్ కావటం ఆలస్యం వెంటనే రీల్స్ చేయటానికి రెడీ అయిపోతుంటారు. కొత్త పాట రాగానే పాత పాటల్ని పక్కన పెట్టేస్తుంటారు. అయితే గతేడాది విడుదలైన మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రంలోని ‘కుర్చి మడత పెట్టి’ సాంగ్ మాత్రం అలా కాదు. ఇప్పటికీ రీల్స్ లో దుమ్మురేపుతుండటమే కాదు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మోతమోగించేస్తోంది. ఈ ఏడాది ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ వచ్చినా థమన్ కంపోజ్ చేసిన ‘కుర్చి మడతపెట్టి’ని మాత్రం బీట్ చేయలేక పోయాయి. ఈ బీట్ సాంగ్ లో మహేశ్ తొలిసారి మాస్ స్టెప్స్ తో ఇరగదీసేశాడు. అందుకే 2024లో సాంగ్ ఆఫ్ ద ఇయర్ గా ‘కుర్చి మడతపెట్టి’ స్థిరమైన స్థానాన్ని సంపాందించింది. మరి 2025లో దీనిని బీట్ చేసే సాంగ్ ఏదో!
Bade Miyan Chote Miyan: 23లో ‘ఆదిపురుష్’… 24లో ‘బడే మియాన్ చోటే మియాన్’!?
Bade Miyan Chote Miyan: 2024లో ఇండియాలో ఘోర పరాజయం పాందిన చిత్రాల జాబితాతో అగ్రస్థానంలో నిలిచిన చిత్రం ఏదంటే ‘బడే మియాన్ చోటే మియాన్’ అని చెప్పక తప్పదు. బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాప్ నటించిన ఈ చిత్రం 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో వాషు భగ్నానీ నిర్మించిన ఈ చిత్రంతో పూజా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తల్లక్రిందులై పోయింది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా వచ్చిన వసూళ్ళు 102 కోట్లు మాత్రమే. అంటే దాదాపు 250 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నమాట. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్, ఆలయ, సోనాక్షిసిన్హా వంటి తారలు నటించారు. 2023లో ప్రభాస్ ‘ఆదిపురుష్’ కూడా ఇదే తరహాలో ఘోర పరాజయాన్ని పొంది ఆ ఏడాది బిగ్గెస్ట్ లాస్ అయిన చిత్రాలలో మొదటి ప్లేస్ లో నిలిచింది. అంటే 2023లో ‘ఆదిపురుష్’, 2024లో ‘బడే మియాన్ చోటే మియాన్’ భారీ నష్టాలు తెచ్చిన జాబితాలో ముందు వరుసలో ఉన్నాయన్నమాట. ఇక ‘బడే మియాన్ చోటే మియాన్’ అంటే ఏకంగా దర్శకనిర్మాతల మధ్య చిచ్చు పెట్టేసింది. క్రిమినల్, ఫోర్జరీ వంటి కేసులతో వారిద్దరూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.