Crime News: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర ఘటన వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన లెక్చరర్లు మృగాళ్లుగా మారి ఓ విద్యార్థినిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బయటపడటంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అకడమిక్ సాయం పేరుతో పరిచయం
బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని, ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర అకడమిక్ నోట్స్ పేరుతో పరిచయం చేసుకున్నాడు. కొద్ది రోజులకే స్నేహాన్ని సాన్నిహిత్యంగా మార్చి, తన స్నేహితుడు అనూప్ గది వద్దకు పిలిపించి ఆమెపై అత్యాచారం చేశాడు.
వీడియోతో బ్లాక్‌మెయిల్, వరుస దారుణం
అనూప్ తన గదిలో జరిగిన ఘటనను వీడియో తీసుకున్నాడు.ఆ వీడియోను చూపించి బయాలజీ లెక్చరర్ సందీప్ కూడా ఆమెపై అత్యాచారం చేశాడు.వీరిద్దరు మాత్రమే కాకుండా, అనూప్ కూడా అదే వీడియోను అడ్డం పెట్టుకుని పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ముగ్గురు కూడా ఆమెను నిరంతరం బెదిరిస్తూ, బ్లాక్‌మెయిల్ చేస్తూనే ఉన్నారు.
తల్లిదండ్రులకు వేదన వ్యక్తం చేసిన విద్యార్థిని
ఒక దశలో భరించలేక ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని తెలిపింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మారతహళ్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు.
ఇది కూడా చదవండి: Accident: అదుపుతప్పి లోయలో పడిన టెంపో వాహనం..ఐదుగురు మృతి
ఒడిశాలో కూడా ఇలాంటి దారుణం
ఇటీవల ఒడిశాలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. బాలాసోర్‌లో బీఈడీ సెకండియర్ విద్యార్థిని, లైంగిక వేధింపులు చేస్తున్న లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. అయితే ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడింది.
సమాజంలో కలకలం
ఈ రెండు ఘటనలు వెలుగుచూడడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను రక్షించాల్సిన గురువులే ఇలా ప్రవర్తించడం సమాజానికి మచ్చ అంటున్నారు. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు.
