Bellamkonda Srinivas: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీ వద్ద టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సృష్టించిన హైడ్రామా సంచలనం రేపింది. మంగళవారం సాయంత్రం తన కారును రాంగ్ రూట్‌లో నడుపుతూ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన శ్రీనివాస్, ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు.
విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే కారును అడ్డుకుని, రాంగ్ రూట్ గురించి ప్రశ్నించాడు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ గట్టిగా నిలదీయడంతో శ్రీనివాస్ తన వాహనాన్ని వెనక్కి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: Allu Arjun: ఆమీర్ ఖాన్ మహాభారతంలో ఐకాన్ స్టార్?
Bellamkonda Srinivas: నెటిజన్లు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, “సినీ హీరోలు కూడా చట్టానికి అతీతులు కాదు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటనపై ట్రాఫిక్ అధికారులకు కానిస్టేబుల్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తన కొత్త చిత్రం ‘భైరవం’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ఘటన ఆయన ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
రాంగ్ రూట్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ హల్చల్
జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్‌లో కార్‌తో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పైకి దూసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. బెల్లంకొండని కానిస్టేబుల్ అడ్డుకుని నిలదీయటంతో శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్… pic.twitter.com/Svi0eIybqB
— ChotaNews App (@ChotaNewsApp) May 13, 2025