Begumpet Woman Assistant Pilot: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక క్యాబిన్ అసిస్టెంట్ మహిళా పైలట్‌పై తోటి పురుష పైలట్ అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు నమోదైంది. ఈ నెల 20న జరిగిన ఈ ఘటన రెండు రోజుల క్రితం బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో బహిర్గతమైంది.
ఏం జరిగింది?
ఈ నెల 20వ తేదీన బాధితురాలు ఒక బిజినెస్ ఫ్లైట్‌లో బేగంపేట నుంచి పుట్టపర్తి, చెన్నై మీదుగా బెంగళూరుకు వెళ్లారు. విమానం సాయంత్రం 4:20 గంటలకు బెంగళూరు చేరుకుంది.ఫ్లైట్ సిబ్బందిలో భాగంగా బాధితురాలు, ఆమెతో పాటు మరో ఇద్దరు పురుష పైలట్లు బెంగళూరులోని ఒక హోటల్‌లో బస చేశారు.హోటల్ గదికి తిరిగి వచ్చిన తర్వాత, తోటి పైలట్లలో ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత మహిళా పైలట్ ఆరోపించింది.బెంగళూరు నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న తర్వాత, బాధితురాలు నేరుగా బేగంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఇది కూడా చదవండి: Srivari Brahmotsavam: హరీష్ రావుకు ప్రత్యేక ఆహ్వానం..
కేసు బదిలీ: బెంగళూరుకు అప్పగింత
బాధితురాలి ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, సంఘటన బెంగళూరులోని హోటల్‌లో జరిగినందున, ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం బెంగళూరు పోలీసులకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ కేసు విమానయాన రంగంలో పనిచేస్తున్న మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

