Begumpet Airport: హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి ఆగంతకులు బాంబు బెదిరింపు మెయిల్ పంపారు. దీంతో విమానాశ్రయ సిబ్బందిని భద్రతా అధికారులు అప్రమత్తం చేశారు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎయిర్‌ఫోర్ట్ ఉద్యోగులు, సిబ్బందిని బైటకు తరలించి, గాలింపు చర్యలు చేపట్టారు.
Begumpet Airport: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో బాంబు ఉన్నదని ఆగంతకులు మెయిల్ ద్వారా బెదిరింపులకు దిగారు. దీంతో పైభద్రతా దళాలతోపాటు స్నిఫ్పర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ బృందాలు ఎయిర్ పోర్టులో అణువణువు గాలిస్తున్నాయి. జాగిలాలు, బాంబ్ ఎక్స్‌ప్లోజివ్ నిఫుణులు ఈ తనిఖీల్లో క్షణ్నంగా పరిశీలిస్తున్నారు.
Begumpet Airport: అత్యవసర సహాయక సిబ్బందిని సైతం ఎయిర్‌పోర్ట్ అథారిటీ రప్పించింది. ఈ మేరకు బాంబు బెదిరింపు మెయిల్‌పై సైబర్ క్రైం అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. మెయిల్ పంపిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈ కసరత్తు కొనసాగుతున్నది.
Begumpet Airport: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అనంతరం అంతర్జాతీయంగా విమాన ప్రయాణాలు ప్రమాదంలో పడ్డట్టయ్యాయి. ఇదే అదనుగా ఆకతాయిలు, అరాచక వాదులు పేట్రేగిపోతున్నారు. బాంబు బెదిరింపు కాల్స్‌తో ఆకతాయి చేష్టలతకు దిగుతున్నారు. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇప్పటి వరకు సుమారు 10 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.

Leave a Reply Cancel reply