Basil Joseph: మలయాళ సినిమా లోకా: చాప్టర్ వన్ – చంద్రలో ఓ కీలక పాత్ర కోసం బాసిల్ జోసెఫ్‌ను సంప్రదించారు దర్శకుడు డొమినిక్ అరుణ్. కథను కూడా వివరించారు. కానీ, ఇతర పనుల కారణంగా ఆ పాత్రను వదులుకున్నారు బాసిల్. ఇప్పుడు ఆ నిర్ణయంపై విచారం వ్యక్తం చేశారు. ఆ పాత్ర ఏంటో మాత్రం రివీల్ చేయలేదు. పూర్తి వివరాలు చూద్దాం.
మలయాళ సినిమా లోకా: చాప్టర్ వన్ – చంద్ర బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సూపర్ హీరో చిత్రం, 165 కోట్లపైగా వసూలు చేసింది. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించగా, డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్‌కు ఓ కీలక పాత్ర ఆఫర్ చేశారు. కానీ, ఇతర సినిమా కమిట్‌మెంట్స్ కారణంగా ఆయన ఈ అవకాశాన్ని వదులుకున్నారు. ఈ నిర్ణయంపై విచారం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్స్ గెస్ట్ రోల్స్‌లో కనిపించారు. సంతి బాలచంద్రన్ రాసిన స్క్రిప్ట్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఐదు భాగాల సిరీస్‌లో మొదటిది. ఈ సినిమా మలయాళం ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం పక్కా అంటున్నారు ట్రేడ్ పండితులు.


