Bank Strike: జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రధాన బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సమ్మె కారణంగా జనవరి 26 అర్ధరాత్రి నుంచి 27 అర్ధరాత్రి వరకు సమ్మె జరుగుతున్నందున బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి. ప్రధానంగా వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్టుట యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది.
Bank Strike: ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్-1947 ప్రకారం.. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), చీఫ్ లేబర్ కమిషనర్, ఆర్థిక సేవలు (డీఎఫ్ఎస్) విభాగానికి సమ్మె నోటీస్ పంపినట్టు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రతినిధులు వెల్లడించారు. తొమ్మిది బ్యాంకు సంఘాల ఉమ్మడి వేదిక అయిన ఈ యూనియన్ 5 రోజుల పనివిధానం అమలు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని ఆయా సంఘాలు తేల్చి చెప్పాయి.
Bank Strike: 2023 డిసెంబర్ 7న ఐబీఏ, యూఎఫ్‌బీయూ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని, ఈ మేరకు ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఇండియన్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కూడా ఆమోదం తెలిపి ప్రభుత్వానికి సిఫారసు చేసిందని యూనియన్లు గుర్తుచేశాయి. ప్రభుత్వ ఆమోదం లభిస్తే అమలు అయి తీరుతుందనే ధీమాతో ఆయా సంఘాలు చెప్తున్నాయి.
Bank Strike: ఇదిలా ఉండగా, రోజువారీ పనివేళలను 40 నిమిషాలు అదనంగా పెంచేందుకు కూడా యూనియన్లు అంగీకరించడం విశేషం. తమ డిమాండ్లపై ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి తుది ఆమోదం లభించినా గత తొమ్మిది నెలలుగా జాప్యం జరుగుతున్నదని, ఈ కారణంగానే తాము మళ్లీ ఆందోళనకు దిగాల్సి వస్తున్నదని ఆయా సంఘాల బాధ్యులు తెలిపారు.
