Tripura: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరిగిన అకృత్యాలు, భారత్ జెండాకు జరుగుతున్న అవమానాలతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం అవుతూ వస్తున్నాయి. అంతేకాకుండా, కొన్ని రోజుల క్రితం అగర్తలా, కోల్‌కతాలోని రెండు ఆసుపత్రులు బంగ్లాదేశ్ పౌరులకు చికిత్సను కూడా నిషేధించాయి. కాగా, సోమవారం త్రిపుర హోటళ్లు, రెస్టారెంట్లు కూడా పెద్ద నిర్ణయం తీసుకున్నాయి. వారు ఇప్పుడు బంగ్లాదేశీయులకు సర్వీస్ ఇవ్వడానికి నిరాకరించారు.
రాష్ట్రంలోని పెద్ద సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘ఆల్ త్రిపుర హోటల్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్’ ఈ నిర్ణయం తీసుకుంది. హిందూ సాధువు చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్ట్ అలాగే బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులపై త్రిపుర రాజధాని అగర్తలాలో భారీ నిరసనలు జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం ప్రకటించారు. ఇది మాత్రమే కాదు, కోల్‌కతాలోని హోటళ్లలో కూడా ఈ అసోసియేషన్ ఈ నిర్ణయాన్ని అమలు చేసింది.
ఇది కూడా చదవండి: RGV: మహాన్యూస్ క్వశ్చన్.. ఆర్జీవీ ఇరిటేషన్.. నేను చెప్పను.. ఫో..!
Tripura: త్రిపుర హోటల్ అసోసియేషన్ తీసుకున్న ఈ చర్య బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై పెరుగుతున్న దాడులు, హింసకు సంబంధించి అందరి దృష్టినీ ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. అయితే, ఈ నిషేధం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ నిర్ణయం తర్వాత, పశ్చిమ బెంగాల్‌లోని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ కూడా బంగ్లాదేశ్ పౌరులకు సేవలను అందించకూడదని సమావేశం తర్వాత నిర్ణయించినట్లు అసోసియేషన్ తెలిపింది.

