Balayya: నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న పీరియాడిక్ చిత్రం కోసం బాలయ్య స్పెషల్ వర్కౌట్ చేస్తున్నారు. ఒక ప్రత్యేక ఎపిసోడ్‌లో యంగ్ గెటప్‌లో కనిపించనున్నారు. దీని కోసం దర్శకుడు గోపీచంద్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Venkatesh: అర్జున్ ఎక్కడ..? వెంకటేష్ వారసుడి ఎంట్రీ పైనే అందరి చూపు..!
బాలకృష్ణ 111వ చిత్రంగా గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో రూపొందుతున్న పీరియాడిక్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒక స్పెషల్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణ యంగ్ గెటప్‌లో కనిపించనున్నారు. ఆ లుక్ కోసం ప్రస్తుతం ఆయన తీవ్ర వర్కౌట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్‌కు థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వనుంది. ఇందులో హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. ఈ చిత్రంలో కొంత హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ ఉంటుంది. బాలకృష్ణ మహారాజు పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత సినిమాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ బాలయ్య అభిమానులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.
