Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న ‘అఖండ 2’ సినిమా అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. సూపర్ హిట్ ‘అఖండ’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో జరుగుతోంది. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళా బ్యాక్‌డ్రాప్‌లో కొన్ని యాక్షన్ సీన్స్‌ను టీమ్ చిత్రీకరించగా, జార్జియాలోనూ కీలక షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా, రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌లో ముఖ్యమైన ఎపిసోడ్‌ల చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read: Manchu Vishnu: శ్రీశైలం మల్లన్న సేవలో సినీ హీరో మంచు విష్ణు
Akhanda 2: 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీకి థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోనుంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. బాలయ్య మరోసారి శక్తిమంతమైన అఘోరి రోల్‌లో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 25న దసరా స్పెషల్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. అభిమానులకు ఫుల్ జోష్ గ్యారంటీ!