Erranna Ramakrishna CPM: రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ సంస్కారం మరిచి వ్యక్తిగత దాడులకు దిగడం సీపీఐ నేత రామకృష్ణకు అలవాటైందంటున్నారు జనసైనికులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను బీజేపీ ఎజెండా మోస్తున్నారంటూ విమర్శించిన ఆయన, పవన్ సతీమణి అన్నా లెజినోవాపై నీచమైన వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు. తిరుమలలో అన్నా లెజినోవా శ్రీవారికి తలనీలాలు సమర్పించుకోవడంపై కూడా నీచంగా కామెంట్ చేశారు రామకృష్ణ. క్రిస్టియన్‌గా ఉండి సనాతన ధర్మాన్ని పాటించడం.. అదేదో ఘోరం, నేరం అయినట్లు అవహేళన చేశారాయన.
ఈ దిగజారుడు వ్యాఖ్యలు విన్నవారు ఒళ్లు మండిపోతున్నారు. ఒక మహిళ వ్యక్తిగత విశ్వాసాన్ని, కొడుకు ఆరోగ్యం కోసం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ రంగులతో దుర్మార్గంగా చిత్రీకరించడం ఏమిటంటూ నిలదీస్తున్నారు. అన్నా లెజినోవా, క్రిస్టియన్ అయినప్పటికీ, కొడుకు మార్క్ శంకర్ అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డాక తిరుమల శ్రీవారికి మొక్కుగా గుండు కొట్టించుకున్నారు. 17 లక్షలు నిత్య అన్నదానం కోసం సమర్పించి, భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఆమె భక్తి, సనాతన ధర్మ పట్ల గౌరవం అందరినీ కదిలించాయి. కానీ, రామకృష్ణ ఈ పవిత్ర నిర్ణయాన్ని రాజకీయ కోణంతో కించపరిచారు.
Also Read: Pawan Health: డిప్యూటీ సీఎం సార్.. ఫ్యాన్స్ మాట వినండి..
Erranna Ramakrishna CPM: ఒక వ్యక్తి మతం, విశ్వాసం వ్యక్తిగతం. దానిపై ప్రశ్నలు వేసే హక్కు ఎవరికీ లేదు. క్రిస్టియన్‌గా ఉండి హిందూ సంప్రదాయాలను గౌరవించడం తప్పా? అలా అయితే, రాజకీయ నేతలు ఇతర మత పండుగల్లో పాల్గొనడం కూడా తప్పేనా? ఒకప్పుడు సైద్ధాంతిక బలంతో గొప్పగా నడిచిన కమ్యునిస్టు పార్టీలు, రామకృష్ణ లాంటి నాయకుల వల్ల కామెడీ షోగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లౌకికవాదం పేరుతో సంస్కారహీన వ్యాఖ్యలు చేసే ఈ తీరు, వామపక్ష ఉనికిని కాలగర్భంలో కలిసిపోయేలా చేస్తోందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ విమర్శలు ఒక ఎత్తు, కానీ మహిళ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం నీచం కాదా? అందుకే రామకృష్ణ వ్యాఖ్యలు కమ్యునిస్టు విలువలకే సవాలు విసురుతున్నాయి.