YCP NSP Parliament: ఒకప్పుడు ఆ పార్లమెంట్ పరిధిలో వైసీపీకి ఎదురులేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్లమెంట్ పరిధిలోని ఏడుకు ఏడు స్థానాలు, ఎంపీ స్థానంతో సహా కైవసం చేసుకుంది వైసీపీ. సీన్ కట్ చేస్తే 2024 కూటమి గాలిలో ఆ నియోజకవర్గంలో వైసీపీ బోర్లా పడింది. ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. అదే పల్నాడు జిల్లా పరిధిలో ఉన్న నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం. అయితే రాజకీయాల్లో గెలుపోఓటములు సహజం. గెలిచినా ఓడినా తమను నమ్ముకున్న క్యాడర్‌కి అండగా నిలబడే వాడే నిజమైన నాయయకుడు. అలానే నిలబడతారు అనుకొని ఎన్నికల టైంలో వారి కోసం పలు హింసాత్మాక ఘటనరల్లో పాల్గొని ఇప్పుడు కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక అల్లాడుతున్నారు. నమ్ముకున్న నాయకులు మాత్రం నియోజకవర్గాన్ని, నియోజకవర్గ క్యాడర్‌ని గాలికి వదిలేశారు.
నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనీల్ కుమార్ యాదవ్ ఎన్నికలప్పుడు క్యాడర్‌కి ఇచ్చిన హమీలు అన్నీ ఇన్నీ కావు. సీన్ కట్ చేస్తే ఎన్నికల తరువాత అనిల్ కుమార్ యాదవ్ పేటవైపు కన్నెత్తి చూసిందే లేదూ. అలాగే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డి అండగా ఉంటారనుకొని వందల సంఖ్యలో ఆ పార్టీ క్యాడర్ కేసుల్లో ఇరుక్కుని ఊసలు లెక్కబెడుతున్నారు. అన్నదమ్ములు మాత్రం ఎన్నికల టైంలో పాల్పడిన హింసాత్మాక ఘటనలు, మొన్న వెల్దుర్తి మండలంలో జరిగిన జంట హత్యల కేసులకు భయపడి పరారీలో ఉన్నారు.
Also Read: Jagan Tenali Tour: జగనా మజాకా? తెనాలి రౌడీషీటర్లకు ఎమ్మెల్యే టిక్కెట్లా..!
YCP NSP Parliament: సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అయితే తనని ఓట్లేసి గెచిపించి మంత్రిని చేసిన వైసీపీ క్యాడర్‌ని, ప్రజలను ఓటమి తరువాత కన్నెత్తెనా చూడనేలేదూ. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ కొత్త ఇన్‌చార్జ్‌గా సుధీర్ భార్గవ్‌రెడ్డిని నియమించింది వైసీపీ అధిష్టానం. పెద్దకూరపాడు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన నంబూరి శంకరావు సైతం నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసిందే లేదు. ఇక వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన బొల్లా బ్రహ్మనాయుడు సైతం ఎన్నికల తరువాత నియోజకవర్గంలో అడుగు పెట్టిందే లేదు. గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమిపాలైన మాజీ మంత్రి విడుదల రజినీని తిరిగి చిలకలూరిపేటకు ఇంచార్జ్‌గా వెళ్లిపోయారు. ఆమె అప్పుడప్పుడు పేటలో మెరిసి వెళుతున్నారు. పల్నాడు ప్రాంతం మొత్తం మీద నియోజకవర్గంలో కనిపిస్తున్న ఏకైక అభ్యర్థిగా నరసరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక్కరే ఉన్నారు.
ఇలా నమ్ముకున్న నేతలు ఆ పార్టీ క్యాడర్‌ని నట్టేట ముంచేసి వెళ్లిపోయారు. తమ నాయకులు ఏదో చేస్తారని భ్రమపడిన క్యాడర్ మాత్రం కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ అల్లాడుతూ చెంపలు వేసుకుంటున్నారట. ఇంకా ఆ పార్టీనే నమ్ముకుని ఉన్న క్యాడర్‌ని.. మేము చేసిన తప్పు మీరు చేయవద్దని వేడుకోంటున్నారట. చూడాలి మరి… చుక్కాని లేని నావలాగా తయారైన నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ పరిస్థితి భవిష్యత్‌లో ఎలా ఉండనుందో.