SI Sudhakar warning: రాప్తాడులో జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ రచ్చ చేసి వెళ్లారు, కానీ రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ ఇచ్చిన స్ట్రయిట్ వార్నింగ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. “బట్టలు ఊడదీస్తాం, నడిరోడ్డుపై పరిగెత్తిస్తాం” అంటూ జగన్ ఖాకీలను కించపరిచేలా నోరు పారేసుకుంటే, తగ్గేదేలేదంటూ ఎస్సై సుధాకర్ యాదవ్ గట్టిగా ఇచ్చిపడేశారు. ”పీకి పడేయడానికి పోలీస్ యూనిఫాం ఏమీ అరటి తొక్క కాదు. కష్టపడి చదివి, రేసుల్లో పరిగెత్తి, వేల మందిని పోటీలో దాటుకుని సంపాదించిన గౌరవం పోలీస్ యూనిఫాం. నిజాయితీగా పని చేస్తాం, నిజాయితీగానే చస్తాం. నీ ఉడుత ఊపులకు అదిరేది లేదు.. బెదిరేది లేదు” అంటూ డైరెక్ట్ పంచ్‌తో జగన్‌ను ఈక ముక్కలా తీసిపడేసిన సుధాకర్ యాదవ్…. ఖాకీ పౌరుషాన్ని ఎలుగెత్తి చాటాడు.
నిన్నటి రాప్తాడు టూర్‌లో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యను టీడీపీపై నెట్టిన జగన్, “రాష్ట్రంలో బిహార్ లాంటి పరిస్థితి నెలకొంది, రెడ్‌బుక్ పాలన సాగుతోంది” అంటూ గగ్గోలు పెట్టారు. అక్కడితో ఆగక, “చంద్రబాబుకు తొత్తులైన పోలీసుల బట్టలు ఊడదీసి, ఉద్యోగాలు పీకేస్తాం” అంటూ బెదిరించారు. గతంలో ఐదుసార్లు ఇలాంటి బూతులే మాట్లాడిన జగన్‌కు ఈసారి సీమ బిడ్డల నుంచి గట్టి రిప్లై వచ్చింది. గతంలో తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు “నాదీ రాయలసీమే” అంటూ ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినా జగన్ బుద్ధి మారలేదు. ఇప్పుడు ఎస్సై సుధాకర్‌తోనూ అనిపించుకున్నారు. వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు ఎస్సై సుధాకర్ యాదవే కారణమని ఆరోపించిన జగన్.. తానో మాజీ ముఖ్యమంత్రిని అన్న స్థాయిని కూడా మర్చిపోయి, డైరెక్ట్‌గా ఎస్సై పేరు ప్రస్థావిస్తూ బెదిరింపులకు దిగారు.
SI Sudhakar warning: పైస్థాయి అధికారులైతే జగన్ ఎన్ని అన్నా పడతారు. పెద్ద పొజిషన్‌లో ఉంటూ సర్వీస్ రూల్స్‌ని వారు అతిక్రమించలేరు. కానీ డీజీపీని తిడతా, ఎస్సై, కానిస్టేబుల్స్‌ని కూడా తిడతా అంటే.. తిరగబడే సుధాకర్ యాదవ్ లాంటోళ్లే తగుల్తారు. బుర్ర లేని వైసీపీ స్ట్రాటజిస్టులు ఈ ఒక్క ఘటనతో జగన్‌ని ఎస్సై స్థాయికి దిగజార్చారన్న టాక్ వినిపిస్తోంది. ఇకనైనా జగన్ తన పద్ధతి మార్చుకోకుంటే.. పోలీసుల పట్ల ఈ దుష్ట వైఖరిని విడిచిపెట్టకుంటే.. రాబోయే రోజుల్లో హోంగార్డు సైతం జగన్‌ని నిలబెట్టి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదరంటున్నారు పొలిటికల్ పండితులు.
Also Read: PM Narendra Modi: ప్రధాని మోదీకి రష్యా ఆహ్వానం.. కీలక వేడుకకు పిలుపు
SI Sudhakar warning: పోలీస్ వర్సెస్ పొలిటికల్ లీడర్ రైవలరీకి క్లాసిక్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది రాప్తాడు స్టోరీ. అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను తొత్తులుగా వాడుకుని, టీడీపీ నేతలపై కేసులు పెట్టించిన జగన్, ఇప్పుడు విపక్షంలో ఉంటూ వాళ్లనే రెచ్చగొడుతున్నాడు. కానీ, ఈసారి ఖాకీలు సైలెంట్‌గా ఉండే పరిస్థితి లేదు. సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న కూడా.. జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఎస్సై సుధాకర్ యాదవ్ వార్నింగ్‌కు పోలీసు డిపార్ట్‌మెంట్ నుంచి మాస్ సపోర్ట్ లభిస్తోంది. ఇలాగే మా యూనిఫాంని కించపరుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటూ ఖాకీ గళం బిగ్గరగా వినిపిస్తోంది. జగన్ నోటి దూల ఇంతటితో ఆగకపోతే, ప్రతి పోలీసోడు తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదంటున్నారు అనలిస్టులు.