Pawan Warnes To Jagan: గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం నెలకొందని, ఆర్థిక వ్యవస్థ కుదేలైందని పవన్ విమర్శించారు. అయినా, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం గాడిన పడుతోందని, ప్రధాని మోదీ మద్దతుతో ఏడాదిలోనే రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొనేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలకు నిధులు పెంచామని, పల్లె పండుగ ద్వారా గ్రామీణ రహదారులను సుందరంగా తీర్చిదిద్దామని పవన్ వివరించారు. ఇక కూటమి ఐక్యత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్. మూడు పార్టీలు ఒక్కటిగా నిలిచి, ప్రజల మద్దతుతో వైసీపీని అధికారం నుంచి దించామని, భవిష్యత్తులోనూ మరో 15 ఏళ్ల పాటు ఈ ఐక్యత ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. పవన్ పదే పదే ఈ విషయం చెబుతుండటం… వైసీపీలో డెత్ బెల్స్‌ని మోగిస్తోంది అంటున్నారు విశ్లేషకులు.
ఇక తొక్కి పట్టి నార తీస్తాం… అనే వార్నింగ్ కాస్త అతిశయోక్తిగా అనిపించినా.. ఆ మాట అనడం వెనుక పవన్ ఉద్దేశం క్లియర్. వైసీపీ ఏదైతే ఇప్పుడు జగన్ పర్యటన విషయంలో రాద్దాంతం చేస్తోందో… గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. చంద్రబాబును జైల్లో పరామర్శించేందుకు వస్తున్న పవన్ కాన్వాయ్‌ని నేషనల్ హైవేపై అడ్డుకోవడం, తన ఫ్లైట్‌ను క్యాన్సిల్ చేయించడం, అమరావతి రైతుల కోసం వెళితే ఇనుప కంచెలతో అడ్డుకోవాలని చూడం, ఇప్పటం వెళ్తున్న సమయంలోనూ ఇలాంటి అవరోధాలే సృష్టించడం వంటి నిర్బంధాలు అనేకం ఫేస్ చేశారు పవన్ కళ్యాణ్. అసలు పవన్ తన కారు రూఫ్‌టాప్‌పైకి ఎక్కి ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చిందో గుర్తు చేసుకుంటే.. ఆయన ప్రస్తుత ఆగ్రహానికి కారణం ఏమిటో అర్థమౌతుంది. పవన్ వారాహి వాహనం అసలు ఏపీ రోడ్లపై ఎలా తిరుగుతుందో చూస్తామంటూ పేర్ని నాని లాంటి వాళ్లు మాట్లాడింది కూడా మర్చిపోకూడదు.
Also Read: Nara Lokesh: ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్
Pawan Warnes To Jagan: ఇక వైసీపీ హయాంలో చంద్రబాబును విశాఖ ఎయిర్‌పోర్టులో అడ్డుకోగా, ఆయన వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుపై అంగళ్లులో రాళ్లు వేయించడమే కాకుండా, తిరిగి రివర్స్‌లో ఆయనపైనే హత్య కేసు పెట్టడం వంటి ఘటనలు టీడీపీకి అనుభవమే. అనపర్తికి వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్‌ని అర్ధరాత్రి నడిరోడ్డుపై అడ్డుకుంటే.. ఆయన పట్టుబట్టి 8 కిలోమీటర్లు నడుకుంటూనే అనపర్తికి వెళ్లారు. ఇక లోకేష్ యువగళం పాదయాత్రకు సృష్టించిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. ప్రచార వాహనాలకు అనుమతి నిరాకరణ, మైక్ లాక్కోవడం, ఆఖరికి కాళ్ల కింద స్టూలు లాగేయడం వంటివి.. నాడు వైసీపీ నిర్భంధాలకు, ఆంక్షలకు అద్దం పట్టే ఘటనలు. ఈ నేపథ్యంలోనే… ‘తొక్కి పట్టి నార తీస్తాం’ అంటూ తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలపై అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఇప్పటికీ వైసీపీ తన పాత పంథాను వీడకపోతే, పవన్ స్వయంగా రంగంలోకి దిగితే, అప్పుడు జగన్ అడుగు కూడా బయటపెట్టలేని పరిస్థితి వస్తుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. గతంలో తానే “హోం శాఖ తీసుకోవాల్సి వస్తుంది” అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, వైసీపీ అందాకా కొని తెచ్చుకుంటే తీవ్ర పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషిస్తున్నారు.
ఇక కూటమి ఐక్యతతో మళ్లీ అధికారంలోకి వస్తుందని, వైసీపీకి అవకాశం లేదని పవన్ బల్లగుద్ది చెప్పారు. ఈ వ్యాఖ్యలు వైసీపీలో ప్రకంపనలు సృష్టించాయి. వైసీపీ గతంలో చంద్రబాబు, పవన్‌లను విడదీసేందుకు సామాజిక వర్గాల రాజకీయాలు, సోషల్ మీడియా దుష్ప్రచారాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు కూడా కూటమిలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నా, పవన్ స్పష్టమైన హెచ్చరికతో వైసీపీ ఆలోచనలో పడింది. రాబోయే ఎన్నికల్లో కూటమి మరింత బలంగా నిలుస్తుందని, వైసీపీ కలలు కనడం వృథా అని పవన్ స్పష్టం చేశారు.