Pawan is Different

Pawan is Different: సింప్లిసిటీలోనే హీరోయిజం!

Pawan is Different: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్‌గా రాష్ట్రాన్ని నడిపిస్తుంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన విలక్షణ శైలితో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్… సినిమాల్లో పవర్‌ స్టార్‌గా మెరిసిన జోష్‌కి ఏ మాత్రం తగ్గకుండా… రాజకీయంలో పీపుల్స్‌ లీడర్‌గా స్వచ్ఛమైన పాలనను ఆవిష్కరించారు. అధికార గర్వం, లాలసలకు తావు లేకుండా, సామాన్యుడి సమస్యలకు సమాధానమైన పవన్, ఈ ఏడాదిలో తన పాలనా దక్షత, సాయమందించే మనసుతో అందరినీ ఆకట్టుకున్నారు.

గడిచిన ఏడాదిలో పవన్ పాలనా శైలిలో మనకు కనిపించేవి సింప్లిసిటీ, సమర్థత, స్థిరత్వం. పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు గ్రామీణ భారతాన్ని బలోపేతం చేశాయి. గ్రామ సభలను ఏకకాలంలో నిర్వహించి, సమస్యలపై చర్చించే వేదికను సృష్టించారు. ‘అడవితల్లి బాట’ కార్యక్రమంతో గిరిజనులకు చేరువై, మన్యం ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి, వేలాది మందికి ఉపాధి కల్పించారు. శ్రామికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా వారి గౌరవాన్ని పెంచాలని సంకల్పించారు. సర్పంచులకు చెక్‌ పవర్‌, నిధుల కేటాయింపుతో గ్రామ స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించారు. ఈ చర్యలు పవన్‌లోని దూరదృష్టిని, గ్రామీణాభివృద్ధి పట్ల అంకితభావాన్ని చాటాయి.

ఏడాది పాలనలో పవన్‌ సాధించిన విజయాలు నాణేనికి ఒక కోణం మాత్రమే. రెండో కోణం మరొకటుంది. చేతికి ఎముక లేకుండా సాయమందించే ఆయన మనసు, ఈ ఏడాదిలో ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపింది. ఒక్క ఏడాదిలోనే రూ.20 కోట్లకు పైగా సొంత నిధులు ఖర్చు చేశారు. కొణిదెల గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు, పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్‌ కుటుంబానికి రూ.50 లక్షలు, తలసీమియా బాధితులకు రూ.50 లక్షలు, ఏపీ, తెలంగాణ వరద బాధితులకు రూ.6 కోట్లు, జనసేన కార్యకర్తల బీమాకు కోటి రూపాయిలు, పిఠాపురంలో ఎలక్ట్రిషియన్లకు రూ.16 లక్షల విలువైన సేఫ్టీ కిట్లు, టీ.టీ.డీకి 17 లక్షలు, డయేరియా బాధితులకు 11 లక్షలు, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు 50 లక్షలు.. ఇలా పవన్‌ విరాళాలకు అంతే లేదు. దీనికి తోడు తనకు వచ్చే మొత్తం జీతాన్ని పిఠాపురంలో అనాద పిల్లలకు నెల నెలా పింఛనుగా అందిస్తున్నారు.

Also Read: Talliki Vandanam: తల్లికి వందనం: జగనే బ్రాండ్‌ అంబాసిడర్‌!

ALSO READ  Donald Trump: టారిఫ్ విధించడానికి ఏప్రిల్ 2 తేదీని ఎందుకు ఎంచుకున్నారు? ..స్వయంగా వివరించిన డోనాల్డ్ ట్రంప్

Pawan is Different: సినిమా హీరోగా ఉన్నప్పుడు దాపరికం లేకుండా దానాలు చేసిన పవన్, రాజకీయ నాయకుడిగా మరింత ఉదారంగా మారారు. ఆపదలో ఉన్నవారి కన్నీళ్లు తుడిచేందుకు ఆయన సొంత నిధులు వెచ్చించేందుకు ఎక్కడా వెనుకాడటం లేదు. సనాతన ధర్మ రక్షణలో పవన్ ఒక ఐకాన్‌గా నిలిచారు. తిరుమల లడ్డూ అపవిత్రం అయిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై టీ.టీ.డీ నుంచి క్షమాపణలు చెప్పించారు. బీజేపీతో బలమైన అనుబంధం కొనసాగిస్తూ, కేంద్ర నాయకులతో సమన్వయం చేస్తూ కూటమి ఐక్యతను బలపరిచారు. చంద్రబాబు విజన్‌ను కొనియాడుతూ, కూటమి బలంగా ఉందన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. చిన్న పొరపాటు జరిగినా స్పందించి, సరిదిద్దే బాధ్యతాయుత నాయకుడిగా నిలిచారు. పవన్ పాలన ఒక స్వచ్ఛమైన రాజకీయ ఉద్యమంలా అనిపిస్తుంది. అధికారం కోసం కాదు, ప్రజల కోసం నిలిచే నాయకుడిగా ప్రజలు పవన్‌ని చూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *