John Benny Lingam : ఆంధ్రప్రదేశ్‌లో మత సామరస్యాన్ని చెరిచేలా వైసీపీ నేత జాన్ బెన్ని లింగం చేసిన విద్వేష వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని హత్యగా చిత్రీకరిస్తూ, రాష్ట్రంలో మత ఘర్షణలను రెచ్చగొట్టేలా ఆయన ప్రసంగం చేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుండగా, బెన్ని లింగం అక్కడకు చేరుకుని, “ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఊచకోత కోస్తాం, మాతో పెట్టుకోవద్దు, మా వద్ద యుద్ధ గుంపులున్నాయి” అంటూ హింసను ప్రోత్సహించారు. ఈ వ్యాఖ్యలు క్రైస్తవ మత పెద్దల సంయమనాన్ని కూడా ఉద్వేగానికి గురిచేశాయి. వైసీపీ క్రైస్తవ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పాస్టర్ ముసుగులో రాజకీయ ఆటలు ఆడుతున్న బెన్ని లింగంపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు బెన్ని లింగంకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి, భారతీ రెడ్డికి సన్నిహితుడైన బెన్ని లింగం, మాజీ మంత్రి కొడాలి నానికి కీలక అనుచరుడు. 2024 ఎన్నికల్లో ‘దైవ సేవకుల ఆత్మీయ సమ్మేళనాలు’ పేరుతో క్రైస్తవులను రెచ్చగొట్టి జగన్‌కు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. గతంలో చంద్రబాబును ‘పిచ్చికుక్క’ అని దూషించి, రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా “క్రైస్తవులకు భద్రత లేదు” అంటూ దుష్ప్రచారం చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత అతని వ్యాఖ్యలు వైసీపీ కుట్రలో భాగమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించినా, బెన్ని లింగం దాన్ని హత్యగా చిత్రీకరిస్తూ అల్లర్లకు దారితీసేలా ప్రవర్తించారు.
ఈ వివాదంలో మాజీ ఎంపీ హర్షకుమార్‌పై విద్వేష వ్యాఖ్యల కేసు నమోదు కాగా, బెన్ని లింగంపై మాత్రం చర్యలు లేకపోవడంపై పౌర సమాజం నుండి అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.
Also Read: Fact Check: ఫ్యాక్ట్ చెక్: ఈ పాపం పవన్‌దా? ఏం జరిగింది?
John Benny Lingam : ఈ నేపథ్యంలోనే వైసీపీ పాస్టర్ జాన్ బెన్ని లింగంను రాజనగరం పోలీసులు విచారణకు పిలిచారు. అక్కడ బెన్ని లింగం యూటర్న్ తీసుకుని, “ఏదో ఆవేశంతో మాట్లాడాను, మత విద్వేషం రెచ్చగొట్టాలనే ఉద్దేశం లేదు, పాస్టర్ ప్రవీణ్‌ది హత్య అనేందుకు నావద్ద ఆధారాలేమీ లేవు” అని బొంకారట. చావు తెలివితేటల్ని పదర్శిస్తూ… తన వ్యాఖ్యలు ఎడిటింగ్‌కు, మార్ఫింగ్‌కు గురయ్యాయని కూడా చెప్పుకొచ్చారట. ఉదయం 11 నుంచి సాయంత్రం వరకు జరిగిన విచారణలో పోలీసులు లోతుగా విచారించినట్లు సమాచారాం. అయితే మళ్లీ అవసరమైతే పిలుస్తామని హెచ్చరించి పంపేసిన పోలీసులు.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.
బెన్ని లింగం సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సైతం బయటకొచ్చాయి. ఇటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర శాంతి భద్రతలకు ముప్పు తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే చట్టపరమైన చర్యలతో ఈ విద్వేషపూరిత కుట్రలను చేధించే అవకాశం కనిపిస్తోంది.