Parthasaradhi

Parthasaradhi: జగన్ మనస్తత్వం గురించి మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Parthasaradhi: మహా గ్రూప్‌ ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా నిర్వహించిన మహా కాంక్లేవ్‌-1లో పార్టిసిపేట్ చేశారు ఐ అండ్ పీఆర్‌ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి. సాక్షి ఛానల్‌ డిబేట్‌లో ఇద్దరు సీనియర్‌ జర్నలిస్టుల మధ్య సాగిన సంభాషణలో భాగంగా అమరావతి మహిళలకు, రాష్ట్ర ఆడపడుచులకు జరిగిన అవమానంపై మహా వంశీ ప్రశ్నను లేవనెత్తడంతో… చర్చ ప్రారంభమైంది.

సాక్షి డిబేట్‌లో మాట్లాడిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? – అమరావతి మీద ద్వేషాన్ని అక్కడి మహిళలపై చూపిస్తారా? ఇంత దారుణంగా కించపరుస్తారా? ప్రజలు మ్యాండేట్‌ ఇచ్చినా మారలేదు. కఠిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జర్నలిస్టులు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. వారిది ఒకటే ఆలోచన.. చంద్రబాబు అమరావతి టేకప్‌ చేశారు.. అది పూర్తయితే చంద్రబాబుకే పేరొస్తుంది.. అన్న ఒకే ఒక్క దురాలోచన తప్ప.. వారిలో విజన్‌, ఒక రీజన్‌ అంటూ ఏదీ కనిపించదు. అమరావతిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. )

365 రోజుల్లో మీ ప్రభుత్వం ఏం సాధించింది అన్న ప్రశ్నకు ఏడాదిగా చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా సమాధానమిచ్చిన మంత్రి పార్థసారధి.. గత జగన్‌ ప్రభుత్వం కన్నా.. తమ ప్రభుత్వం మెరుగైన సంక్షేమం ఇస్తున్నా… దాన్ని ప్రచారం చేసుకోవడంలో, ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎక్కడో కాస్త విఫలమవుతున్నామేమో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Also Read: PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన డబ్బులు.. వీరికి రావు, ఎందకంటే ?

Parthasaradhi: జగన్‌ మోహన్‌ రెడ్డి సంక్షేమ పథకాలకు బటన్‌లు బాగా నొక్కారని వారు ప్రచారం చేసుకున్నారు. – మేము సంక్షేమం ఇస్తున్నా… దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాస్త వెనుకబడ్డామేమో అనిపిస్తుంది. ఇంకా బాగా ప్రజల్లోకి తీసుకెల్లాల్సి ఉందని నా అభిప్రాయం. ఇక అభివృద్ధి విషయానికొస్తే.. రోడ్లు బాగుపడ్డాయి. పంచాయితీలకు దాదాపు వెయ్యి కోట్లు ఇచ్చాం. ఎన్నాజీఎస్‌ నిధులు తీసుకొచ్చాం. పవన్‌ కళ్యాణ్‌ గారి పనితీరు చూస్తున్నాం. పోలవరం 2027 డిసెంబర్‌కి పూర్తి చేస్తామని బల్లగుద్ది చెప్తున్నాం. అమరావతి విషయానికొస్తే.. రాష్ట్ర బడ్జెట్‌కి ఒక్క రూపాయి భారం లేకుండా.. అంతర్జాతీయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి.. ప్రధాన మంత్రితో ఘనంగా పున:ప్రారంభించుకున్నాం.

అమరావతి విషయంలో చంద్రబాబుకు పేరు రాకూడదనే ఒకే ఒక్క ఆలోచనతో వైసీపీ ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది తప్పిస్తే.. తమ చర్యతో ఎన్ని లక్షల మందికి నష్టం కలిగిస్తున్నాం అని చూసుకోలేదన్నారు మంత్రి పార్థసారధి. ఒక్క అమరావతే కాదనీ, టిడ్కో ఇళ్ల విషయంలోనూ వారు ఇదే ఆలోచనతో ఆ ఇళ్లంటినీ పాడుబెట్టారనీ, లబ్దిదారులను ఇబ్బంది పెట్టారని చెప్పారు.

టిడ్కో ఇళ్లు వైసీపీ చేసిన మరో అన్యాయం. 50 వేలు, లక్ష రూపాయలు డబ్బులు కట్టి.. ఇళ్లు చేతికి రాక మరో వైపు అద్దెలు కట్టుకుంటూ జీవిస్తున్నారు. లబ్ధిదారుల పేర్ల మీద లోన్‌లు వీళ్లు తీసుకొచ్చి.. వారిని బ్యాంకులు ఇబ్బంది పెట్టేలా చేశారు. చంద్రబాబు అనుభవజ్ఞుడు కాబట్టి, విజన్‌ ఉన్న లీడర్‌ కాబట్టి.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.

Also Read: TANA Youth Conference: తానా 24వ‌ మ‌హాస‌భ‌ల్లో యువ‌త‌రంగం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద యూత్ ఈవెంట్‌కు ప్లాన్‌

ALSO READ  Pakistan: మీకు తెలుసా.. పాకిస్థాన్ కంటే మన దేశంలోని రాష్ట్రాల జీడీపీ ఎక్కువ

Parthasaradhi: పీఎంఏవై స్కీమ్‌ గురించి వంశీ అడిగిన ప్రశ్నకు… గత ప్రభుత్వ నిర్వాకాలకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలను వెల్లడించారు హౌసింగ్‌ శాఖ మంత్రి అయిన కొలుసు పార్థ సారథి.

ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఇప్పించి, 50 వేలు, 75 వేలు, లక్ష రూపాయలు అదనంగా ప్రభుత్వం ఇచ్చి… వారికి గృహ వసతి కల్పించాలని గత చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. అటువంటి హౌసింగ్‌ స్కీమ్‌లో 2014-19 మధ్యలో కట్టుకున్న ఇళ్లకి మేము డబ్బులివ్వం అంటూ 900 కోట్లు ఎగ్గొట్టింది వైసీపీ ప్రభుత్వం. పీఎమ్‌ఏవై 1.0 స్కీమ్‌ కింద చంద్రబాబు హయాంలోనే 20 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. అందులో ఆరున్నర లక్షల ఇళ్లు మాత్రమే గత వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. 2024కే స్కీమ్‌ గడువు ముగిసినా, చంద్రబాబు తన పరపతితో ప్రధానిని ఒప్పించి గడుపు పొడించారు.

సీనియర్‌ పొలిటీషియన్‌ అయిన పార్థసారధి… వైఎస్సాఆర్‌ హయాంలో పనిచేశారు. జగన్‌ ప్రభుత్వంలో పనిచేశారు. ఇప్పుడు చంద్రబాబు పాలనలోనూ పనిచేస్తున్నారు. అయితే వైఎస్సార్‌, జగన్‌, చంద్రబాబు.. ముగ్గురు సీఎంలతోనూ పనిచేసిన పార్థసారధి వారిపై ఎలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు? జగన్ ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? అన్న ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చిన పార్థసారధి.. వైసీపీ భవిష్యత్‌ ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నకు చాలా డిప్లమ్యాటిక్‌గా స్పందించారు.

Also Read: YS Jagan Podili Tour: వైఎస్ జగన్ పర్యటనలో ఉద్రిక్తత.. రాళ్లు, చెప్పులతో దాడులు

Parthasaradhi: వైఎస్‌, చంద్రబాబు ఇరువురు ఇరువురే. ఇద్దరూ ప్రజా నాయకులే. వైఎస్‌ ఇప్పుడు లేరు. ఆయన గురించి కంపేరిజన్‌ అనవసరం. నేను కాంగ్రెస్‌, వైసీపీలలో ఉన్నప్పుడు చంద్రబాబుపై అనేక మంది అనేక రకాలుగా మాట్లాడేవారు. కానీ చంద్రబాబు పాలనని దగ్గరగా చూశాక, ఆయన కాలి గోటికి సరిపోని వాళ్లంతా ఎందుకు అలా మాట్లాడుతున్నారని ఆశ్చర్యం వేసింది. ప్రతి నాయకుడు కూడా చంద్రబాబు దగ్గర నేర్చుకోవాల్సి ఏదో ఒక అంశం ఉంటుంది.

జగన్‌ని దగ్గరగా చూశారు కదా. మరి ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి? – నేనెప్పుడూ ఆయన్ని దగ్గరగా చూడలేదండీ. ఆ ఐదేళ్లలో నేను ఆయన్ను కలిసింది ఓ నాలుగైదు సార్లు మాత్రమే. అదే గొప్పగా భావించే వారు అప్పటి నా సహచర వైసీపీ నేతలు. ఎంత సేపు ఆయన కోటరీ చెప్పే మాటలే ఆయనకు రుచిస్తాయి తప్పిస్తే.. ప్రజల సమస్యలు ఎపుడూ జగన్ లెక్కపెట్టలేదు. జగన్‌ ప్రేమ చూరగొనాలంటే.. అక్కడ ఒకే ఒక్క మార్గం ఉంది. చంద్రబాబు, పవన్‌, లోకేష్‌లను తిడితేనే.. జగన్‌ చేరదీస్తారు. ఆయన కళ్లలో పడతారు. కానీ వైఎస్‌ శైలి వేరు. నేను జర్నలిస్టులపై పరుషంగా మాట్లాడిన ఓ సందర్భంలో నెక్ట్‌ డే మార్నింగ్‌ వైఎస్‌ ఫోన్‌ చేసి మందలించారు. భాష అదుపులో లేకుంటే నువ్వేం మంత్రివయ్యా అంటూ క్లాస్‌ పీకారు.

వైఎస్సార్‌సీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు – వైసీపీ భవిష్యత్తు గురించి మాకు ఆలోచన లేదు. మా ఆలోచనంతా చంద్రబాబు విజన్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి. చంద్రబాబు, లోకేష్‌ల కృషితో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం 2029లో మళ్లీ కూటమి అధికారంలోకి రావాల్సిన అవరసరం ఉంది. మా ఆలోచన, మా పనితీరు అంతా దానిపైనే ఉంది.

ALSO READ  KTR: కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పగ్గాలు ఎవరికి

Also Read: AP News: తల్లికి వందనం పథకానికి జీవో జారీ: తల్లుల ఖాతాల్లోకి నిధులు!

Parthasaradhi: జగన్‌కి మీరు ఎందుకు దగ్గర కాలేకపోయారు.? మంత్రి పదవి ఎందుకు రాలేదు. – జగన్‌ని మెప్పించలేక పోయానేమో. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లని దుర్భాషలాడాలి. అలాంటివాళ్లే పార్టీ పట్ల కమ్మిట్‌మెంట్‌తో ఉన్నట్లు బహుషా జగన్‌ భావిస్తారేమో. నేను అలా చేయలేను కాబట్టే.. నేను సమర్థున్ని కాదని, కమిట్‌మెంట్‌ లేదని పక్కన పెట్టి ఉండొచ్చు.

మీరు, జగన్‌ కారులో ప్రయాణిస్తున్నప్పుడు బందర్‌రోడ్డులో మీ రెండు ఎకరాలను అడిగారనీ, దానికి మీరు మౌనం వహించారనీ, ఆ మౌనం కొనసాగుతూ వచ్చిందని చర్చ ఉంది. – పార్టీ కార్యాలయానికి స్థలం అడిగారు. ఎవ్వరూ ముందుకు రాకుంటే నేను ఇచ్చాను.

నెక్ట్స్‌ 4 ఇయర్‌ మీ లక్ష్యాలేంటి? – ముఖ్య మంత్రి ఆలోచన 20 లక్షల ఉద్యోగాలు, ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్‌, అమరావతి, పోలవరం, మిగిలిపోయిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. 93 సెంట్రల్లీ స్పాన్సర్డ్‌ స్కీమ్డ్‌ ఉంటే.. అన్నీ అటకెక్కించారు. కేంద్రం నిధులిస్తే, దానికి మ్యాచింగ్‌ గ్రాంట్స్‌ ఇవ్వలేక.. ఆ స్కీమ్స్‌ అన్ని నిరుపయోగం చేశారు. సుమారు 1.47 లక్షల కోట్ల రూపాయిలతో కేంద్రం ప్రాజెక్టులు చేపడుతోంది. 5 ఏళ్లలో పవర్ కాస్ట్‌ను తగ్గించాలి. 10 ఇండస్ట్రియల్‌ పాలసీలను తీసుకొచ్చి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఇంకా ఇంప్రూవ్ చేయాలి. పారిశ్రామిక హబ్‌గా ఏపీని తయారు చేస్తాం. క్వాంటం వ్యాలీ తీసుకొస్తున్నాం. విజన్ 2047లో భాగంగా 53 లక్షల రూపాయల పర్‌ క్యాపిటా ఇన్‌కమ్‌ తీసుకురావాలని చంద్రబాబు ఆలోచన. అన్ని వర్గాలను, ప్రతి కుటుంబాన్ని ఇందులో భాగం చేస్తాం.

Also Read: Harish Rao: పంచాయతీలకు నిధుల ఇస్తలేరు..

ఇక ఆంధ్రప్రదేశ్‌ జర్నలిజం ఫోరం తరఫు ప్రతినిధులడిగిన ప్రశ్నకు ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రి పార్థసారధికి సమాధానమిస్తూ.. అనేక అంశాలపై స్పష్టతనిచ్చారు.

ఈ సంవత్సర కాలంలో అక్రిడిటేషన్‌ కార్డులు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది. వచ్చే మూడు నెలల కాల పరిమితిలో ఈ సమస్యను షార్ట్‌ అవుట్‌ చేస్తారా? హెల్త్‌ కార్డ్‌ ఇష్యూస్‌, అలాగే జర్నిస్టులకు ఇళ్లు నిర్మాణం చేసి ఇస్తామన్న హామీ కూడా ఈ అక్రెడిటేషన్‌ కార్డులతో ముడిపడి ఉంది. – 2014-19 సమయంలో 22 వేల అక్రిడిటేషన్‌ కార్డులుంటే వైసీపీ ప్రభుత్వం దానిని 12 వేలకు కుదించింది. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడడు. అన్ని జర్నలిస్టు సంఘాల ఆలోచనలు, అభిప్రాయాలను తీసుకుంటున్నాం. ఇంకా మెరుగ్గా ఏం చేయగలం అనేలా సబ్‌ కమిటీ వేశాం. అక్రిడిటేషన్‌ పాలసీ ద్వారా ఇంకా ఎక్కువ మందిని ఏ విధంగా ఇన్‌క్లూడ్‌ చేయొచ్చు అన్నది చూస్తున్నాం. ఇళ్ల స్థలాల విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లాం. కానీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొంచెం టైమ్‌ పడుతుందని కూడా తెలియజేస్తున్నాం. 3 నెలలు ఎక్స్‌టెన్షన్‌ చేశాం. కానీ ఇక నెక్ట్స్‌ టైమ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఉండదని హామీ ఇస్తున్నాం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *