Narayankhed

Narayankhed: 70 ఏళ్లు, 17 ఎన్నికలు.. ఖేడ్‌ చెత్త రికార్డ్!

Narayankhed: సంగారెడ్డి జిల్లాలో కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గం, వెనుకబడిన ప్రాంతంగా పేరుగాంచింది. అభివృద్ధిలో వెనుకబడిన ఈ ప్రాంతం మంత్రి పదవి విషయంలోనూ దూరంగానే ఉంటోంది. ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగినా, ఇక్కడి ఎమ్మెల్యేలకు క్యాబినెట్‌లో చోటు దక్కలేదు. ప్రతిసారీ నిరాశే మిగిలింది.

నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్, మనూర్, నగల్గిడ, కంగ్టి, సిర్గాపూర్, కల్హేర్, నిజాంపేట్, పెద్ద శంకరంపేట్ అనే ఎనిమిది మండలాలు ఉన్నాయి. ఇక్కడ 2 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా, గిరిజన ఓటర్లు అధికంగా ఉన్నారు. ప్రతి ఏటా కర్ణాటక, మహారాష్ట్రలోని చెరకు ఫ్యాక్టరీల్లో పనుల కోసం వలసలు వెళ్లడం ఇక్కడి వెనుకబాటుతనానికి నిదర్శనం. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ, గెలిచిన ఎమ్మెల్యేలు… సీఎంలకు, మంత్రులకు వినతులు ఇచ్చినా ఫలితం శూన్యం. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కినట్లయితే.. వలసల నివారణకు చర్యలు చేపట్టడం సాధ్యమవుతుంది.

Narayankhed: 1952లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అప్పారావు షెట్కార్ విజయం సాధించారు. అప్పటి నుండి 70 ఏళ్లలో ప్రజలు ప్రతి పార్టీకి అవకాశం ఇచ్చినప్పటికీ, ఎమ్మెల్యేలు మంత్రులుగా మారిన దాఖలాలు లేవు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 10 సార్లు, టీడీపీ 2 సార్లు, బీఆర్‌ఎస్ 2 సార్లు విజయం సాధించాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్ నుండి క్రిష్ణారెడ్డి గెలిచారు. ఆయన మరణం తర్వాత 2016 ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డి విజయం సాధించారు. 2018లోనూ ఆయనే గెలిచినప్పటికీ, మంత్రి పదవి దక్కలేదు. 2023లో బీఆర్‌ఎస్ నియోజకవర్గంలోనూ, రాష్ట్రంలోనూ అధికారం కోల్పోయింది.

Also Read: LRS Discount: ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు పొడిగించేనా..?

Narayankhed: 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పట్లోల సంజీవ్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ, సంజీవ్ రెడ్డికి ఇప్పటివరకు క్యాబినెట్‌లో చోటు దక్కలేదు. ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం లభిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. సంజీవ్‌రెడ్డి చేతికి మంత్రి పవర్స్‌ ఇచ్చినట్లయితే.. వలసల నివారణ, ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపడతారని ఇక్కడి ప్రజలు ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *