Lokesh Shakalo Coverts

Lokesh Shakalo Coverts: బిగ్‌ ఎక్స్‌పోజ్‌‌: హార్డ్‌ కోర్ జగన్ బ్యాచ్ అంతా విద్యా శాఖలోనే?

Lokesh Shakalo Coverts: కూటమి ప్రభుత్వంలో టీడీపీ యువనేత, భవిష్యత్‌ అధినేతగా చెప్పబడుతున్న నారా లోకేష్‌ నాలుగు శాఖలను చూస్తున్నారు. హ్యూమన్‌ రీసోర్స్‌ డెవలప్మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్మూనికేషన్‌, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అనే నాలుగు శాఖల బాధ్యతలు లోకేష్‌కు అప్పగించారు సీఎం చంద్రబాబు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అంటే ఐటీ, రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది దేశంలో ఎవరికైనా సరే చంద్రబాబే. ఆయా రంగాలపై చంద్రబాబు అంతలా ముద్ర వేశారు. ఆ శాఖల్లో లోకేష్‌ ఎంత సాధించినా ఆ క్రెడిట్‌ చంద్రబాబు ఖాతాలోకే వెళ్తుంది. ఇక ఆల్రెడీ వృద్ధిలో ఉన్న ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లోనూ లోకేష్‌ పెద్దగా సాధించేది ఏదీ ఉండదు. ఇక లోకేష్‌ తనని తాను నిరూపించుకుని, సమర్థుడినని ప్రూవ్‌ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క శాఖ హ్యూమన్‌ రీసోర్స్‌ డెవలప్మెంట్‌.

దీని కిందికే ఎడ్యుకేషన్‌ అంటే విద్యాశాఖ కూడా వస్తుంది. గత వైసీపీ హయాంలో విద్యాశాఖలో అనేక అవకతవకలు జరిగాయి. నాడు-నేడు పేరుతో పాఠశాలలకు రంగులు, బలవంతంగా ఇంగ్లీష్‌ మీడియం చదువులు, టీచర్లతో వైన్‌ షాపుల్లో మద్యం అమ్మించడం, అనవసరమైన యాప్‌లతో టీచర్లపై భారం, స్కూల్‌ పిల్లలకిచ్చే కిట్లపైనా జగన్‌ బొమ్మలు, విద్యార్థుల చేతికి ట్యాబులు ఇవ్వడం, అవి దుర్వినియోగం అవడం.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. సంస్కరణల పేరిట చదువుల్ని భ్రష్టు పట్టించిన ఘనత గత వైసీపీ సర్కార్‌కే దక్కుతుంది. అందుకే.. విద్యాశాఖ చేపట్టడం అంటే సీఎం చంద్రబాబు తనకిచ్చిన ఛాలెంజ్‌గా భావిస్తున్నానంటూ పలు సందర్భాల్లో చెప్పారు నారా లోకేష్‌. ఇప్పటికే లోకేష్‌ తీసుకున్న అనేక కీలక నిర్ణయాలతో విద్యాశాఖలో ప్రక్షాళన మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో వెలుగులోకి వస్తోన్న కొన్ని కఠిన వాస్తవాలు.. లోకేష్‌ని, విద్యాశాఖని ప్రమాదంలోకి నెట్టేలా కనబడుతున్నాయి అంటున్నారు పలువురు అనలిస్టులు.

పరీక్షల నియంత్రణ అధికారి శ్రీనివాసరెడ్డి, (టెక్ట్స్‌ బుక్స్‌ తయారీ విభాగానికి డైరెక్టర్ కృష్ణారెడ్డి,) ఓ వైసీపీ ఎమ్మెల్సీ భర్త ప్రతాపరెడ్డి, కేజీబీవి అంటే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల వ్యవహారాలు చూస్తున్న దేవానంద రెడ్డి, సపోర్ట్ ఆంధ్ర లెర్నింగ్ ట్రాన్ఫర్మేషన్‌ విభాగంలో కీలక బాధ్యతలు చూస్తున్న సతీష్ రెడ్డి, సీమ్యాట్ విభాగంలో ఓ మహేష్ రెడ్డి.. వీరంతా ఎవరనుకుంటున్నారా? కీలకమైన విద్యాశాఖలో నేటికీ తిష్ట వేసుకుని కూర్చున్న కోవర్టులు అంటూ ఆరోపిస్తున్నారు పలువురు విద్యాశాఖ అధికారులు, పార్టీ ముఖ్య నేతలు. వీరంతా జగన్ హయాంలో కడప ప్రాంతం నుంచి దిగబడిన సరుకని చెప్తున్నారు. హార్ట్ కోర్ జగన్ బ్యాచ్ అంతా తమ విద్యా శాఖలోనే ఉన్నారని వాపోతున్నారు. వీళ్లను పట్టుకొని, విద్యాశాఖను ఛాలెంజింగ్‌గా తీసుకొని, బాస్ ఎలా బాగు చేస్తారంటూ ఆవేదన, అసహనం వ్యక్తం చేస్తున్నారు సదరు అధికారులు, నేతలు. “పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు” అంటూ ఇప్పటికే మీడియాలో పరువు పోగొట్టుకున్నారు. ఈ రోజు రీవాల్యుయేషన్ సమస్య వెలుగు చూసింది. రేపు పేపర్ లీక్ వంటి సమస్యలు రావని గ్యారెంటీ ఏంటి? ఆల్రెడీ టెక్స్ట్ బుక్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో.. చంద్రబాబు చెప్పిన పొలిటికల్ కోవర్టుల సంగతేమో కానీ… ప్రభుత్వ కోవర్టుల సంగతి తేల్చకుంటే.. ప్రభుత్వానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

ALSO READ  BAN vs IND T20: ఉప్పల్ T20కి టీమిండియాలో మార్పులు! ఆ ముగ్గురికీ ఛాన్స్ ఉంటుందా?

Also Read: Viral News: పెళ్లి చేసుకోకపోతే లాభాల కంటే నష్టాలు ఎక్కువగా.. వైరల్ అవుతున్న మహిళ పోస్ట్

Lokesh Shakalo Coverts: తెలుగుదేశం పార్టీని నడిపించే భావి సారథి, కాబోయే ముఖ్యమంత్రి అని అందరూ ప్రశంసిస్తున్న నారా లోకేష్ ఏరికోరి చాలెంజింగ్‌గా ఎంచుకున్న విద్యాశాఖలో ప్రభుత్వ కోవర్టులు కుప్పలు తెప్పలుగా ఉన్నారని ఆ శాఖలో డెడికేటెడ్‌గా పనిచేసే పలువురు అధికారులు చెబుతున్నారు. విద్యా శాఖలో లోకేష్‌ విప్లవాత్మకమైన సంస్కరణలు చేపడుతున్నారనీ, ఎంత మంచి చేసినా ఈ కోవర్టుల కారణంగానే వైసీపీ వారు ఫేక్ ప్రచారంతో విద్యాశాఖపై విషం చిమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా శాఖలో చర్చలో ఉన్న అంశాలు వైసీపీ కరపత్రికలో బ్యానర్ కథనాలు అవుతున్నాయనీ, ప్రతి ఏటా ఉండే రీకౌంటింగ్, రీవేల్యూషన్లో దిద్దుబాట్ల శాతం వైసీపీ హయాంలో కంటే తక్కువగా ఉన్నా.. ఏదో పొరపాటు జరిగినట్టు ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక వైసీపీ సానుభూతిపరులైన విద్యాశాఖ ఉన్నతాధికారులు కొందరు ఉన్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఒకరోజు సిలబస్‌పై, మరొక రోజు లీప్ యాప్‌పై, ఇంకో రోజు మధ్యాహ్న భోజనంపై ఫేక్ ప్రచారాలు కొనసాగుతూనే ఉండటం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.

వైసీపీ హయాంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలవాలని, వైసీపీ నేతల కంటే దారుణంగా అక్రమాలకు పాల్పడిన అధికారులంతా ఇప్పుడు అదే విద్యా శాఖలో వివిధ శాఖల అధిపతులుగా ఉన్నారన్న వాస్తవం వెలుగు చూసింది. ఇంకా విచిత్రంగా గత ప్రభుత్వంలో విద్యాశాఖను చూసింది బొత్స సత్యనారాయణే అయినా, అధికారం అంతా పులివెందుల బ్యాచ్‌దేనని ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా.. ఇంకా వీరంతా విద్యా శాఖలోనే కొనసాగుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. విద్యాశాఖను భ్రష్టు పట్టించి, అంతిమంగా ఆ శాఖ మంత్రి నారా లోకేష్‌కు చెడ్డ పేరు తేవాలన్నదే తాడేపల్లి బిగ్‌ బాస్‌ వీరికి ఇచ్చిన టాస్క్‌ అని తెలుస్తోంది. నేడు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌గా ఉన్న భరత్ గుప్తా.. నాడు సీఎం జగన్‌కు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరించి ఎన్నికల వ్యూహాలనూ అమలు చేసే బాధ్యతలు నిర్వర్తించారని పలువురు గుర్తుచేస్తున్నారు.

Also Read: Anagani Satya Prasad: జగన్ చేసిన పాపాలకి.. పశ్చాతాప దినం చేసుకోండి

Lokesh Shakalo Coverts: జగన్ హయం నాటి రంగులు, అవినీతి లేకుండా విద్యార్థులకు యూనిఫాంలు, బూట్లు, పుస్తకాలు, అందజేస్తామని లోకేష్ ప్రకటించారు. ఈ టెండర్లలో దాదాపు 200 కోట్లు మిగిల్చారు. కానీ ఆ బాధ్యతలను 2016లో 35 లక్షలు లంచం తీసుకుని ఏసీబీకి దొరికిపోయిన ఎమ్మార్ ప్రసన్నకుమార్‌కు నేడు అప్పగించారు. ఈయన అసలు సిసలైన హార్డ్ కోర్ జగన్ భక్తుడని చెబుతుంటారు. రీవాల్యూషన్ గొడవ జరుగుతున్న సందర్భంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి వివరణలు, సవరణలు ఇస్తున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి భర్త ప్రతాపరెడ్డి, కేజీబీవి డైరెక్టర్ దేవానంద రెడ్డి, సాల్ట్ డైరెక్టర్ సతీష్ రెడ్డి, సీమ్యాట్ మహేష్ రెడ్డి, (ఎస్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి,) ఏఎస్పీడీ రవీంద్ర నాథ్ రెడ్డిలు విద్యా శాఖలో కీలక పదవుల్లో ఉన్నారు. వీళ్లలో చాలా మంది జగన్ హయాంలో కడప ప్రాంతం నుంచి వచ్చిన వారే. హార్డ్ కోర్ జగన్ బ్యాచ్‌గా ముద్ర వేసుకున్నారు. వీరిలో కొందరు మంచి వాళ్లు ఉన్నా, డెడికేటెడ్‌గా పనిచేస్తున్నా.. జగన్ బ్యాచ్ కోవర్టులు జీవోలు తయారు కాకుండానే టీచర్లను భయపెట్టడం, తప్పుడు ప్రచారంతో ఆందోళన కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ALSO READ  YCP Silly Games: రాజకీయాల్లో ఏంటి ఈ సిల్లీ గేమ్స్‌?

పొలిటికల్ కోవర్టుల పని పడతానని హెచ్చరించిన సీఎం చంద్రబాబు.. ఈ గవర్నమెంట్ కోవర్టుల సంగతి కూడా తేల్చాలని పార్టీలో ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు. రెడ్ బుక్ చర్యలు తప్పుడు నేతలపైనే కాదు.. తప్పుడు అధికారులపై కూడా ప్రయోగించాలని లోకేష్‌కి సూచిస్తున్నారు. మరి టీడీపీ అధినేత, యువనేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *