Lokesh-Modi meeting: నాటి & నేటి ప్రధాని మోడీ – నేటి మంత్రి లోకేష్ – నాటి ముఖ్యమంత్రి జగన్. అటు గతంలో మోడీతో జగన్ భేటీ అయిన ఫొటోను, ఇటు తాజాగా మోడీతో లోకేష్ భేటీ అయిన ఫొటోను పక్క పక్కనపెట్టి ట్రోల్స్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ పిక్చర్ చూస్తే… పుష్పా సినిమాలో షెకావత్ మాదిరి… ‘ఒక్కటి తక్కువైంది’ అంటూ జగన్ బ్యాచ్ ఎంత రగిలిపోతుందో కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మండదా అన్నా… మండదా అక్కా.. అన్న జగన్ డైలాగ్‌ని జాయింట్ చేసి విపరీతంగా వైరల్ చేస్తున్నారు. సీఎంగా వెళితే జగన్‌కి దక్కనిది, మంత్రిగా వెళ్లిన లోకేష్‌కి దక్కిందన్నది ఆ ట్రోల్స్‌లోని అంతరార్థం. ఇంతకీ అదేంటన్నదేగా మీ అనుమానం. అదేనండి.. మోస్ట్ వ్యాలిబుల్ థింగ్.. రెస్‌పెక్ట్. ఆ రెండు ఫొటోలలో ఒకదాంట్లో ఉన్నది, మరొకదాంతో లేనిది ‘రెస్‌పెక్ట్’.. ముఖ్యమంత్రిగా వెళ్లినా జగన్ పట్ల చూపని అభిమానం, గౌరవం.. మంత్రిగా వెళ్లిన లోకేష్ పట్ల మోడీ మెండుగా చూపాడదన్నది తమ్ముళ్ల అభిప్రాయం.
2 గంటలకు పైగా.. ఒక రాష్ట్ర మంత్రితో ప్రధాని సమావేశం అవ్వడం మాత్రం “సాధారణ విషయం” కాదనే చెప్పాలి. అసలే వైసీపీకి ఇది వెరీ క్రూషియల్ టైమ్. అందుకు కారణం ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఘనకార్యం.. లిక్కర్‌స్కామ్. అంతిమ లబ్ధిదారుడు జగనే అన్నది ఇప్పటి వరకూ జరిగిన సిట్ విచారణల సారంశం. సాధారణంగా రాష్ట్రంలో ఓ పెద్ద నాయకుడి అరెస్ట్ జరగబోయే సందర్భంలో.. కేంద్ర పెద్దలకు సమాచారమివ్వడం పొలిటికల్ సంప్రదాయం. ఈ నేపథ్యంలో.. గవర్నర్ పర్మిషన్ నుంచి మొదలు పెడితే… మోడీ-లోకేష్‌లు ఏమేమి మాట్లాడుకొన్నారో అని యలహంకా ప్యాలెస్లో ఎంత భీభత్సం నడుస్తోందో, ఎన్ని టీవీలు బద్దలయ్యాయో అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆ విషయం ప్రక్కనబెడితే.. రాజకీయాల నుండి అభివృద్ధి వరకు అన్నీ చర్చకు వచ్చి ఉంటాయన్నది వాస్తవం.
ప్రత్యేక పెట్టుబడులు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రం పట్ల శాశ్వత భరోసా, ఇన్వెస్టర్లకు నమ్మ్మకం కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలు, “దశాబ్దానికి పైగా పెండింగు”లో వున్న “రాష్ట్రానికి ఉపయోగపడే రాజకీయ అంశాలు” అన్నీ చూచాయగా చర్చించుకొనే ఉంటారని రాజకీయ విశ్లేషకుల అంచనా. మోడీ ప్రధానిగా ఉన్న గత పది పదకొండేళ్లలో.. నారా లోకేష్‌లాగా అత్యంత ఉత్థాన పతనాలను ఎదుర్కొని, నిలబడి, తలపడి, వియజపథంలోకి దూసుకొచ్చిన యంగ్ జనరేషన్ లీడర్ ఈ దేశంలోనే మరొకరు ఉండరేమో. అంతెందుకు… మోడీనే స్వయంగా గతంలో పలు సందర్భాల్లో.. లోకేష్ కేవలం వారసుడు కాగలడు తప్ప.. లీడర్ కాలేడు అన్న విధంగా మాట్లాడారు. తన డైనమిజంతో అందరి భ్రమల్నీ బద్ధలు కొట్టిన నారా లోకేష్.. అదే విధంగా తన విషయంలో మోడీ ఆలోచనలనూ తల్లకిందులు చేసి ఉండాలి. లేకపోతే.. లోకేష్ పట్ల నరేంద్రమోడీ అంత మమకారం, వాత్సల్యం కనబరిచేవారు కాదేమో. అందుకే… అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అభినవ అభిమన్యుడిని చూసి, ముచ్చటేసి, మెచ్చుకున్న విధంగా ఉంది తాజాగా లోకేష్‌కు మోడీ ఇచ్చిన ఆతిధ్యం… అంటున్నారు విశ్లేషకులు.
Also Read: Hyderabad: మెట్రో చార్జీలపై దిగొచ్చిన ఎల్‌అండ్‌టీ
Lokesh-Modi meeting: మోడీ స్వయంగా తనతో డిన్నర్‌కి ఆహ్వానించే వారు అతి తక్కువ మంది ఉంటారు. కుటుంబసభ్యులుగా భావించే వారిని మాత్రమే ప్రధాని మోదీ అలా పిలుస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నారా లోకేష్‌తో పాటు కుటుంబాన్ని పిలిచి కుటుంబసభ్యుల్లా తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. నారా లోకేష్‌లో పట్టుదల, రాజకీయాలు ఎలా చేయాలన్నదానిపై ఉన్న స్పష్టమైన విజన్ ప్రధాని మోదీని ఆకట్టుకుందని చెబుతారు. రానున్న రోజుల్లో భారత దేశంలో యువ నాయకత్వానిదే హవా. దేశ వ్యాప్తంగా రాణిస్తున్న, ప్రభావవంతంగా పైకి ఎదుగుతున్న యువ నేతల్లో నారా లోకేష్ టాప్ ప్లేస్‌లో ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. లోకేష్ సాధించిన విజయాలు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీలో, ఏపీ రాజకీయాల్లో లోకేష్ పోషిస్తున్న పాత్రే.. అందుకు కొలమానం. ఈ నేపథ్యంలో లోకేష్.. భావితరానికి అత్యంత కీలకమైన నేతగా ఆవిర్భవించనున్నారన్న అంచనా మోదీకి ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇప్పుడిప్పుడే నలభైల్లోకి వచ్చిన నారా లోకేష్.. దేశ రాజకీయాలలో కీలకమైన నేతగా మారే అవకాశం ఉంది. తనపై అలాంటి అభిప్రాయాన్ని మోదీకి లోకేష్ కల్పించారని అనుకోవచ్చు. దాని ఫలితమే.. ప్రధాని మోడీ ఇంట లోకేష్ కుటుంబానికి దక్కిన ఈ అపూర్వ ఆతిథ్యం.
