Liquer Adulteration

Liquer Adulteration: ఉపిరి పీల్చుకున్న కుట‌మి ప్రభుత్వం..

Liquer Adulteration: రాష్ట్రంలో క‌ల్తీ మ‌ద్యం వ్వ‌వ‌హారంలో దొంగే.. దొంగా దొంగా అని అరిచిన‌ట్లు ఉంది వైసిపి పరిస్థితి. రాష్ట్రంలో అన్న‌మ‌య్య జిల్లా తంబళ్లపల్లి, కృష్టా జిల్లా ఇబ్ర‌హింప‌ట్నం వ‌ద్ద రెండు చోట్ల క‌ల్తీ మ‌ద్యం త‌యారు కేంద్రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ వ్య‌వ‌హరంలో ప్ర‌భుత్వంపై వైసిపి పెద్ద ఎత్తున్న త‌ప్పుడు ప్ర‌చారం చేసింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఇప్పటికే 2019- 2024 వైసిపి హాయంలో రాష్ట్రంలో మ‌ద్యం పాల‌సీ వ‌ల‌న వేల కోట్ల దోపిడి చేశారనే ఆరోప‌ణ‌ల‌పై కుట‌మి స‌ర్కార్ కేసులు న‌మోదు చేసింది. ఇప్ప‌టికే ప‌లువురు మాజీ అధికారులు, ప‌లువురు వైసిపికి చెందిన కీల‌క వ్య‌క్తలు ఇందులో నిందితులుగా ఉన్నారు. ఇప్ప‌టికే ఈ కేసులో పలువురు జైలుకు వెళ్లి బెయిల్‌పై బ‌య‌ట‌కి రాగా… మ‌రి కొంద‌రు నిందితులు జైల్లోనే ఉన్నారు. ఇప్ప‌టి కే మ‌ద్యం వ్య‌వ‌హారంలో పీకల్లోతు మునిగిన వైసిపికి.. ఇప్పుడు కూటమి ప్రభత్వంలో క‌ల్తీ మ‌ద్యం వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డ‌టంతో.. దీనిని ఆయుధంగా చేసుకుని కుట‌మి స‌ర్కార్‌ను ఇరుకున పెట్టేలా మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేసింది. మీడియా, సోష‌ల్ మీడియాల్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయడంతో ఏపీ ప్ర‌భుత్వం కొంత ఇబ్బంది ప‌డింది. అయితే సిఎం చంద్ర‌బాబు దీనిపై సీరియ‌స్ అవ్య‌డంతో పాటు, ఆయ‌నే రంగంలోకి దిగ‌డంతో.. ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేయ‌డంతో.. అస‌లు వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది.

Also Read: Kapil Sharma: కపిల్ శర్మ రెస్టారెంట్‌పై మళ్లీ దాడి?

రాష్ట్రంలో క‌ల్తీ మ‌ద్యం త‌యారీ కేంద్రాల‌ను ప్ర‌భుత్వ‌మే తెరిచింద‌ని ప్ర‌చారం చేసింది వైసీపీ. అయితే ఈ కేసులో కీల‌క నిందితుడుగా ఉన్నఅద్దేప‌ల్లి జ‌నార్ధ‌న‌రావును అరెస్ట్ చేయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌పడింది. త‌న‌తో న‌కిలీ మ‌ద్యం త‌యారు చేయించేలా చేసింది వైసిపికి చెందిన మాజీ మంత్రి జోగి ర‌మేషే అని ఆయన ప్ర‌క‌టించ‌డంతో.. ఒక్కసారిగా వైసీపీ ప్లాన్ అడ్డం తిరిగింది. దీంతో వైసిపి దీనిపై ఇప్ప‌టి వ‌రకూ త‌ప్పుడు ప్ర‌చారం చేసింద‌న్న విషయం తేలడంలో ఒక్కసారిగా రాష్ట్ర ప్ర‌జ‌లు అవాక్క‌య్యారు. వైసిపి ఇప్ప‌టికే త‌మ పాల‌న‌లో మ‌ద్యం కేసుల్లో ఇరుక్కోని బ‌య‌ట‌ప‌డ‌టానికి నానా తంటాలు ప‌డుతుంటే.. త‌మకు అంటిన మ‌ద్యం మ‌కిలిని చంద్ర‌బాబు స‌ర్కార్‌కూ పూయాల‌నే వైసిపి కుట్ర‌ బ‌ట్ట‌బ‌య‌లు అయ్యింది. సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే దీనిపై సిట్ ఏర్పాటు చేయ‌డంతో.. సిట్ ఇప్ప‌టికే రంగంలోకి దిగి క‌ల్తీ మూలాల్లోకి వెళ్లింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క జోగి ర‌మేష్ హ‌స్త‌మే బ‌య‌ట‌ప‌డింది. దీనిలో ఇంకెంత మంది నేతల పేర్లు బ‌య‌ట‌కి వ‌స్తాయో వేచి చూడాలి. ప్ర‌స్తుత ప‌రిణామంతో.. క‌ల్తీ మ‌ద్యంలో అస‌లు విష‌యాలు బ‌య‌ట‌కు రావ‌డంతో కుట‌మి స‌ర్కార్ సేఫ్ జోన్‌లోకి వెళ్లింద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *