Jogi Ramesh Remand Report: వైసీపీ హయాంలో నైకిలీ మద్యం తయారీనీ పరిశీలించిన జోగి రమేష్.. దానినే తన ప్రధాన బిజినెస్‌గా మార్చుకున్నారు. ఇక తమ అక్రమ వ్యాపారానికి మద్దతు పలికిన జోగికి నగదు ఇస్తూ వచ్చారు ప్రధాన నిందితుడు జనార్దన రావు. రెండు నెలలకు ఒక సారి రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలు చొప్పున చెల్లింపులు జరిగినట్లు ఆధారాలతో సహా సిట్ గుర్తించింది. జోగి రమేష్ సూచన మేరకు బ్యాంక్ నుంచి డ్రా చేసిన మొత్తంలో 2022 జూన్ నెలలో రెండుసార్లు ఫెర్రీ ఘాట్ వద్ద జోగి రాముకు ఒకసారి రూ.4 లక్షలు, మరోసారి రూ.5 లక్షలు ఇచ్చినట్లు జనార్దనరావు సిట్‌కు ఆధారాలిచ్చారు. 2023 మే నుంచి కూడా ఏఎన్‌ఆర్ బార్‌లోనే నకిలీ మద్యం తయారీ జరిగింది. జనార్దన రావు విజ్ఞప్తి మేరకు జోగి సోదరులు బార్‌కు వచ్చి స్వయంగా నకిలీ మద్యం ప్రాసెస్ పరిశీలన చేశారు. వీరి నకిలీ మద్యంతో ప్రభుత్వానికి రూ.9 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇక ఆఫ్రికా వెళ్ళడానికి ముందు… సెప్టెంబర్ 23న జోగి రమేష్ ఇంటికి వెళ్ళిన అద్దేపల్లి జనార్దన రావు, అక్కడే జోగి సోదరులను కలిశారు. రూ.3 కోట్లు ఇస్తామని జోగి సోదరుల భరోసాతో రెండు రోజుల తరువాత.. 25న ఆఫ్రికా వెళ్ళి పోయారు జనార్దన రావు. జోగి సోదరుల ఇంటరాగేషన్‌లో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి అంటున్నారు సిట్ అధికారులు.
Also Read: PM Kisan yojana: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు పడేది అప్పుడే!
జోగి రమేష్‌తో నిందితులు అద్దేపల్లి జనార్దన రావు, జగన్మోహన్ రావు అనుబందం సుదీర్ఘమైంది. అద్దేపల్లి సోదరుల తండ్రి ఇబ్రహీంపట్నంలో కిరిణా షాప్ నిర్వహించేవారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు కిరాణ్ షాప్‌కు రెగ్యులర్ కస్టమర్స్. అలా మొదలైంది పరిచయం. ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో స్వర్ణ బార్ నిర్వహణలో జోగి సోదరులు భాగస్వాములు అయ్యారు. స్వర్ణ బార్ పేరును చెర్రీస్ బార్‌గా మార్చారు. 2006 నుంచి 2019 వరకూ దీని నిర్వహణ సాగింది. బొర్రా అనిల్ కుమార్, బొర్ర శ్రీనివాస రావు ఓనర్షిప్‌లో నడిచింది. ఇబ్రహీం పట్నంలోని బాలాజీ బార్‌ను గుడ్ విల్ చెల్లించి తీసుకున్నారు. లైసెన్స్ జనార్దన రావు పేరు మీద మారిన తరువాత ఏఎన్‌ఆర్ బార్‌గా పేరు మార్చారు. 2017లో లిక్కర్ సిండికేట్‌గా ఏర్పడ్డారు. 2019 జనరల్ ఎన్నికల వరకూ ఈ సిండికేట్ సాగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నేపధ్యంలో లిక్కర్ సిండికేట్ బ్రేక్ అయినా… జోగి సోదరులతో జనార్దన రావు సన్నిహితం కొనసాగింది. కోవిద్ సమయంలో నష్టం వచ్చిన నేపధ్యంలో నవంబర్ 2021 నుంచి ఏఎన్‌ఆర్ బార్, చెర్రీస్ బార్‌లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మారు. హైదరాబాద్‌లోని నిజాం పేటలో ఒక రూం తీసుకొని, నాసి రకం మద్యం కొనుగోలు చేసి, 35 లీటర్ల క్యాన్లలో ఫినాయిల్ పేరిట ఇబ్రహీంపట్నంకు రవాణా చేశారు. ఏఎన్‌ఆర్ బార్‌లో నకిలీ మద్యం తయారు చేసి విక్రయించారు. జోగి సోదరులకు నగదు చెల్లించడాన్ని తన బిజినెస్ పార్ట్‌నర్‌లు ప్రశ్నించగా.. ఇబ్రహీంపట్నంలో తన కార్యకలాపాలకు జోగి సోదురులు మద్దతిస్తున్నందువల్లే వారికి ముడుపులు ఇస్తున్నట్లు వెల్లడించారు జనార్దన రావు. 2022లో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన బార్ లైసెన్స్ విధానంతో లాభసాటి కాదని లిక్కర్ బిజినెస్ నుంచి బయటకు వచ్చారు జోగి సోదరులు.
Also Read: Coimbatore: కోయంబత్తూరులో ఎన్‌కౌంటర్: గ్యాంగ్ రేప్ నిందితులను కాల్చి అరెస్ట్ చేసిన పోలీసులు
2023 మేలో గోవాకు చెందిన బాలాజీ అనే వ్యక్తి జనార్దన రావుకు పరిచయం అయ్యాడు. నకిలీ మద్యం తయారీలో అతను ఎక్స్‌పర్ట్ కావడంతో ఏఎన్‌ఆర్ బార్‌లోనే నకిలీ మద్యం తయారీ మొదలెట్టారు. జయచంద్రా రెడ్డితో పరిచయం ఉండడంతో 2024 ఎన్నికల్లో తంబళ్ళపల్లి వెళ్ళి ఆయన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు జనార్దన రావు. తాను గెలవలేకపోయినా తన మద్దతుదారులకు వచ్చిన రెండు వైన్ షాపుల నిర్వహణ అప్పగించారు జయచంద్రారెడ్డి. ఈ విషయాన్ని జోగి రమేష్‌తో చెప్పాడు జనార్దన రావు. దీనిని కూటమి ప్రభుత్వంపై బురదజల్లాలన్న తమ ప్లాన్‌ను ఆచరణలో పెట్టడానికి అవకాశంగా మలుచుకున్నారు జోగి సోదరులు. జనార్దన రావు ద్వారా ముల్కలచెరువులో నకిలీ మద్యం తయారీ మొదలెట్టించారు. ఇక జోగి తన రాజకీయ డ్రామాని అమలు చేసే ముందు.. సేఫ్‌గా జనార్దన రావును ఆఫ్రికా పంపించారు. ఆ తర్వాత ముల్కలచెరువులో నకిలీ మద్యంపై ఎక్సైజ్ శాఖకి లీకులిచ్చారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ యూనిట్‌ని తానే పట్టించానంటూ సాక్షి మీడియాని తీసుకెళ్లి జబర్ధస్త్ డ్రామా ప్రే చేశారు. ఆఖరికి తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారు జోగి రమేష్.

