Jagan Time to go Gail

Jagan Time to go Gail: అదానీ స్కామ్‌లో మిస్‌.. లిక్కర్‌ స్కామ్‌లో ఫిక్స్‌!

Jagan Time to go Gail: ఇప్పటివరకు జరిగిన రాజకీయ డ్రామా ఒక ఎత్తైతే, ఇకపై జరగబోయేది మరో ఎత్తు! వైసీపీ హయాంలో జరిగిన నేరాల గుట్టు ఒక్కొక్కటిగా విప్పబడుతోంది. మద్యం కుంభకోణం, జెత్వానీ కేసుల్లో నిజాలు బయటకు వస్తున్నాయి. అన్నింటికీ మూల స్థంబంలా మారిన జగన్‌మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తోంది. “తెలియదు, గుర్తులేదు” అన్న నిందితులు ఇప్పుడు నోరు విప్పి, జగన్ సూచనలతోనే అన్నీ చేశామని కక్కేస్తున్నారు. ఈ సంచలన పరిణామాలు జగన్ అరెస్ట్‌ను అనివార్యం చేస్తున్నాయని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అక్రమాలు, నిధుల మళ్లింపు జగన్ ఆదేశాల మేరకే జరిగాయని వెల్లడించాడు. నాడు కుంభకోణాలలో సూత్రధారులు, పాత్రధారులు అయిన ఐపీఎస్ అధికారులు, వైసీపీ సానుభూతిపరులు ప్రస్తుతం అరెస్ట్‌లో ఉండగా, వారూ నిజాలు చెప్పడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, నాడు సీఎంలో చక్రవర్తిలా వెలుగొందిన ఐఏఎస్‌ ధనంజయ రెడ్డి, భారతి రెడ్డి వ్యాపార వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే బాలాజీ గోవిందప్పలకు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించి, అరెస్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జగన్‌కు గట్టి షాక్‌ అంటున్నారు పరిశీలకులు.

Also Read: Mock Drill: హైదరాబాద్‌లో బుధవారం మాస్ మాక్ డ్రిల్

Jagan Time to go Gail: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ విచారణ కూడా దగ్గర పడుతోంది. ఈ నెల 8న మిధున్‌ రెడ్డి భవిష్యత్తును సుప్రీం కోర్టు తేల్చేయనుంది. అటు జెత్వానీ కేసులోనూ విచారణాధికారులు త్వరలో నిజాలు బయటకు తెస్తామని ధీమాగా ఉన్నారు. అయితే మొండిఘటాలు అనకున్న నిందితులు సైతం ఇంత బేలగా ఎందుకు ప్రవర్తిస్తున్నట్లు? విచారణాధికారులకు పెద్దగా శ్రమ కల్పించకుండానే.. నోరు విప్పడానికి కారణాలు ఏంటి? అని పరిశీలిస్తే… ఒకటి, అధికారం కోల్పోగానే జగన్ వారిని పట్టించుకోకపోవడం… రెండు, నిజాలు చెప్పితే ఉపశమనం పొందే అవకాశం ఉండటమే అంటున్నారు విశ్లేషకులు. ఈ పరిణామాలు జగన్‌ను చట్టపరంగా, రాజకీయంగా ఇరుక్కుపెడుతున్నాయి. మరికొద్ది రోజుల్లో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తే, జగన్ అరెస్ట్ తప్పదని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ కేసులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, దర్యాప్తు ఊహించని విధంగా వేగంగా పరిగెడుతుంటం, కీలక నిందితుల అరెస్టులు అలవోకగా జరుగుతుండటంతో.. జగన్‌ “లడ్డూలా దొరకబోతున్నారు” అనే సంకేతాలే వెలువడుతున్నాయి.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *