CM CBN Helicopter : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తరచూ రాష్ట్రంలో పర్యటనలకు ప్రస్తుతం ఓ హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నారు. ఆయనతో పాటు రాష్ట్రంలో పలువురు వీఐపీలు కూడా ఇదే హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తిరుపతి పర్యటనలో భాగంగా తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం సీఎం చంద్రబాబు వినియోగించే హెలికాప్టర్‌ను సిద్ధం చేసింది. అయితే, ఆయన హెలికాప్టర్‌లోకి ఎక్కిన తర్వాత దానిలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో కేంద్ర మంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంపై అధికారులు అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్‌లో టెక్నికల్, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్‌పై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్‌కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ఈ హెలికాప్టర్‌ను వినియోగించవచ్చా? లేదా? అనే అంశంపై నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు.
Also Read: Chevireddy: సత్యమేవ జయతే..! తాట తీయనున్న సిట్..!
CM CBN Helicopter: సీఎం చంద్రబాబు పర్యటించే హెలికాప్టర్ వినియోగంపై గత నెల 13న సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ, డీజీసీఏ అధికారి, ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీ సభ్యులుగా ఐదుగురితో కమిటీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత హెలికాప్టర్‌కు ఉన్న ఇబ్బందులు ఏంటి? మరొకటి తీసుకోవాలంటే ఏది మంచిదో కూడా నిపుణులతో చర్చించి నివేదిక ఇవ్వనుంది ప్రభుత్వం నియమించిన కమిటీ. సీఎం చంద్రబాబుతో సహా వీఐపీల భద్రత అత్యంత ప్రధానం. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అదనపు డీజీ కూడా త్వరలో మరో నివేదిక డీజీపీకి సమర్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత హెలికాప్టర్‌ను మార్చడమా? లేదా? ప్రభుత్వం కొత్తగా హెలికాప్టర్‌ను కొనడమా? అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

