Anagani Satya Prasad: మా భూములు మాకేనని ఎగసిపడ్డ ప్రజాగ్రహం. మా భూములపై మీ పెత్తనమేంటి, మా ఆస్తులపై మీ ఫొటోలేంటి అంటూ నిలదీసిన ధిక్కార స్వరం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై కన్నెర్ర చేసిన ప్రజానీకం. అసైన్డ్, అటవీ భూముల అవకతవకలపై పెల్లుబుకిన ఆగ్రహం. తమ భూముల్ని చెరపట్టిన ప్రభుత్వాన్ని గద్దె దించి కూటమి సర్కార్‌కు పట్టం కట్టింది ఆంధ్ర ప్రజానీకం. నేటికి సరిగ్గా ఏడాది కాలం. మరి ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా? ల్యాండ్ టైటిలింగ్ రద్దయింది. అటవీ, అసైన్డ్ భూముల గుట్టు వీడిందా? నూతన ప్రభుత్వ భూ విధానం, రెవెన్యూ సంస్కరణల దశ, దిశ ఎటువైపు? ఈ అంశాలపై విజయవాడలో నిర్వహించిన మహా కాంక్లేవ్ వేదికగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో చర్చించారు మహా వంశీ. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ప్రజలకు హామీ ఇచ్చినట్లుగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడే.. రెండో సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు స్వస్తి పలికారు నారా చంద్రబాబు నాయుడు. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా రద్దయినట్లేనా? ఇదే అంశంపై తొలి ప్రశ్న ఎదురైంది రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా రద్ధయినట్లేనా? పాస్ పుస్తకాలపై ఫొటోలు రద్దయినట్లేనా? – ఏడాది అయ్యింది. గత ఏడాది చెప్పాము. ల్యాండ్ టైటిలింగ్ రెపెల్లింగ్ యాక్ట్‌పైన సంతకం పెట్టి, దాన్ని అసెంబ్లీలో పెట్టి, పూర్తిగా రద్ధు చేశాం. ఇక పాస్ పుస్తకాల గురించి అడిగారు.. మా అమ్మ ఫొటో పెట్టుకుంటే, మా తాత ఫొటో పెట్టుకుంటే మాకు ఆనందం… 6680 గ్రామాల్లో 21 లక్ష పాస్ పుస్తకాల్లో ఒక్కటి కూడా కరెక్టుగా లేవు. వాళ్లకు మళ్లీ ఫ్రీగా ఇవ్వడానికి 22 కోట్లు అవుతుంది. వృధా అయిపోయింది. ఇక రాళ్లపై జగన్ ఫొటో ఏంటండి… వెయ్యి ఏళ్ల తర్వాత తవ్వితే.. మా రాజు ఇచ్చాడని చెప్పుకోడానికా? 650 కోట్లు.. దాన్ని ఎరేజ్ చేయడానికి 12 కోట్లు.. ప్రజా ధనం. )
Also Read: Mahaa Conclave 2025: 15 లక్షల కుటుంబాలు దత్తత..
రెవెన్యూ, స్టాంప్స్ ఇవి రెండూ అవినీతి ఎక్కువగా ఉన్నటువంటి శాఖలు. ఈ సంవత్సర కాలంలో అవినీతి తగ్గిందా? పెరిగిందా? ఫేస్ లెస్ మ్యూటేషన్స్ తేబోతోన్నాం. గ్రీవెన్స్, ఆర్‌ఓఆర్ కలెక్షన్స్ కూడా, ఫేస్ లెస్, కాంటాక్ట్ లెస్, ఆన్‌లైన్ వెళ్లిపోవాలన్నది అధ్యయనం చేస్తున్నాం. టైమ్ పట్టుద్ది. )
రిజిస్ట్రేషన్స్ శాఖలో రిజిస్ట్రేషన్స్‌కి వెళ్తే.. పైన రాజు గారు.. కింద ప్రజలుంటారు.. పేపర్లు విసిరేస్తుంటారు.. ఆ పోడియంలు అన్నీ పగలగొట్టారు ఏంటి? – అతనేమీ పెద్ద పోస్టు కాదు.. జ్యుడీషియరీ పోస్టు కాదు.. అతని ముందు వేలిముద్రలు వేసి.. ఎందుకిదంతా? ఫ్రెండ్లీ అట్మాస్పియర్ ఉండాలని మేం చేసిన పని అది. అది కూడా అవినీతిని తగ్గించే ప్రక్రియ. )
మీరు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. వాటి రిజల్ట్ ఎట్లా ఉంది? – 6TH డిసెంబర్ నుండి 8TH జనవరి దాకా చేశాము. 2 లక్షల 69 వేలు ఎన్నో వచ్చాయి. అన్నీ అడ్రస్ చేశాము. ఇవి చేయగలిగాము. ఇవి ఎందుకు చేయలేము అన్నది స్పీకింగ్ నోట్ ఇవ్వమంటున్నాం. ఒక కొలిక్కి అయితే వచ్చింది. )
Also Read: Mahaa Conclave 2025: బాబు విజన్..మహా వంశీ రియాక్షన్..
Anagani Satya Prasad: ఏడాది పాలన కాలంలో మంత్రి అనగాని సత్యప్రసాద్‌కి సంతోషం కలిగించిన అంశం ఏంటి? బాధ కలిగించిన అంశం ఏంటి? మహిళలపై ఇటీవల కాలంలో కొందరు చేసిన మాటల దాడిపై అనగాని స్పందన ఏంటి?
ఏడాది పాలన కాలంలో మంత్రి అనగాని సత్యప్రసాద్‌కి సంతోషం కలిగించిన అంశం ఏంటి? బాధ కలిగించిన అంశం ఏంటి? చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం కంటే ఆనందం ఏముంటుంది. చంద్రబాబు థాట్స్ బియాండ్ ద థాట్స్. బాధ అంటే ఇప్పుడు కాదు.. 2019 నుండి 2024 వరకు బాధలు అనుభవించాం. జర్నలిజం ముసుగులో గత 2019-24 వరకు కూడా ఇలాగే వ్యవహరించారు. మీరు కంటతడి పెట్టారు.. మేం చూశాం. మీకా బాధొచ్చింది. అతని డబ్బు తప్ప వేరే ఆలోచన లేదు. మీరు ఒంగోలు ఎక్కడో సీతారామపురంలో సామన్య కుటుంబం. ఇరవై ఏళ్లు కష్టపడితే సీఎండీ స్థాయికి వచ్చారు. అతను తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వచ్చాడు. )
Also Read: Mahaa Conclave 2025: అకౌంట్లో 15 వేలు.. మహిళలకు బాబు బంపర్ ఆఫర్..
Anagani Satya Prasad: ఆరోగ్యాన్ని పాడు చేసి మరణాలకు కారణమైన వాటి మీద చర్యలు ఉండబోతున్నాయా? – ప్రతి దాని మీదా ఉండబోతున్నాయి. మదనపల్లి వదలం, పుంగనూరు వదలం, మఠం ల్యాండ్స్ వదలం, అటవీ భూములు వదలం. మేం ప్రజా హితం కోరే వాళ్లం. ఒకట్రెండు రోజులు లేటైనా పర్వాలేదు కానీ.. పొరపాటున ఒక మంచి వాడికి చెడు చేయకూడదు. పక్కా ఎవిడెన్స్ చూసిన తర్వాత చర్యలు తీసుకుంటాం. ఎవరు సూత్రధారి, ఎవరు పాత్రధారి అనేది ఆల్ డిపార్ట్ మెంట్స్ లో ఎంక్వైరీ జరుగుతోంది. మీకు చర్యలు కనబడుతూనే ఉన్నాయి. మేం వెండెక్టివ్ గవర్నమెంట్ కాదు. )
పార్టీ పట్ల, అధినేత పట్ల తన లాయల్టీతో చంద్రబాబు, లోకేష్‌లకు దగ్గరైన వ్యక్తి అనగాని సత్యప్రసాద్. అనగానిని నారా లోకేష్ భోళా శంకరుడు అని పిలుస్తుంటారట. అనగాని-లోకేష్‌ల ఈ బాండింగ్ గురించి అడిగారు మహా వంశీ. అయితే లోకేష్‌తో తన బాండింగ్ గురించి అనేక విషయాలు ప్రస్తావిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు మంత్రి అనగాని.
లోకేష్‌తో మీ బాండింగ్ ఏంటి – రూపాయి కూడా తీసుకోకుండా పేదలకు భూములు ఇవ్వాలని లోకేష్ లక్షం. {వంశీ సార్ ప్రశ్న} – చంద్రబాబు మీద దాడి జరిగే ప్రయత్నం చేసినప్పుడు మీరు అడ్డంగా నిలబడ్డారు. ఆరోజు ఏం జరిగింది? {అనగాని సమాధానం} – కౌన్సిల్ చైర్మన్‌ని మర్చిపోకూడదు. వారి మీద ఎంత ఒత్తిడి ఉందంటే లంచ్ టైమ్‌కి వెళ్తే అందరూ చుట్టు ముట్టారు. నేను అచ్చం నాయుడు ఇద్దరమే వెళ్లాం. నమాజ్ చేసి రాష్టానికి మంచి చేయండి అని అడిగాం. చంద్రబాబును కుంగదీసే విధంగా డైలాగులు కొడుతున్నారు. కౌల్సిల్ చైర్మన్ కమిటీ వేస్తూ ఆర్డర్స్ ఇచ్చారో.. బూతులు తిట్టడం మొదలుపెట్టారు. అప్పుడు అడ్డు నిలబడ్డా. అది బ్యాడ్ ఇన్సిడెంట్ )
Also Read: Mahaa Conclave 2025: 2 కోట్ల మందితో యోగ..
Anagani Satya Prasad: చంద్రబాబు, లోకేష్‌లో ఏంటి వ్యత్యాసం? – ఏ ఇద్దరూ ఒకలా ఉండరు. చంద్రబాబు ఆలోచన వారు మాత్రమే చేయగలుగుతారు. వేరెవ్వరూ చేయలేరు. లోకేష్ 2 ఇయర్స్ ట్రాన్ఫర్మేషన్, క్యాడర్‌ని ఆదుకోవాలనే తపన, ఈ ఏడాదిలో అడ్మినిస్టేషన్‌లో అన్ని డిపార్టమెంట్లలో ప్రక్షాళన చేస్తున్నారు. మంచి నాయకుడికి కావాల్సిన అన్ని లక్షణాలు వచ్చాయి లోకేష్‌కి.
ఇక టీడీపీ భవిష్యత్ అధినేతగా లోకేష్ పేరు తెరపైకి వస్తున్న నేపథ్యంలో మహా వంశీ అడిగిన ఓ ప్రశ్నకు… మంత్రి అనగాని సత్యప్రసాద్.. కూటమి ఐక్యతను దృష్టిలో పెట్టుకుని తెలివిగా సమాధానం చెప్పడం హైలెట్‌గా నిలిచింది.
లోకేష్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? – టీమ్ చంద్రబాబు, టీమ్ కూటమి ప్రభుత్వం బాగుంది. టీమ్ పవన్ బ్రహ్మాండంగా ఉంది. దయ ఉంచి పుల్లలు పెట్టకండి దాంట్లో. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. నాయకులు హ్యాపీగా ఉన్నారు. పవన్ మంచి సలహాలిస్తారు. చంద్రబాబు ఏది బెస్టో అది చేస్తారు. లోకేష్ గారు.. పాజిటివ్ మూడ్ ఉంది. ప్లీజ్ ఇప్పుడేమొద్దు )