Mazaka Movie

Mazaka Movie: ‘మజాకా’ నుండి బ్యాచిలర్ యాంథమ్

Mazaka Movie: సందీప్ కిషన్ నటిస్తున్న 30వ చిత్రం ‘మజాకా’. రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేశ్‌, అన్షు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రాజేశ్ దండ, ఉమేశ్‌ కేఆర్ బన్సాల్ దీనిని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 21న విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా బ్యాచ్ లర్ యాంథమ్ ను విడుదల చేశారు. బ్రహ్మచారుల జీవితంలో ఉండే స్ట్రగుల్, జాయ్ తదితర అంశాలపై ఈ పాట సాగింది. రామజోగయ్య శాస్త్రి దీనిని రాయగా, ధనుంజయ్ సీపాన దీనిని పాడారు. లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు. రఘు మాస్టర్ అందించిన స్టెప్పులతో ఈ పాట సినిమాలో హైలైట్‌గా నిలవనుంది. దీనిని సందీప్ కిషన్, రావు రమేష్‌లపై వైజాగ్ బీచ్‌లో చిత్రీకరించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chiranjeevi: చిరంజీవి సినిమాలో వెంకటేష్ కీలక పాత్ర!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *