Ayodhya: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్ఠాత్మకమైన పవిత్ర అయోధ్య ఆలయంలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తొలుత ఆలయంలో అభిషేకంతో ఉత్సవాలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారు.
Ayodhya: అయోధ్య రామాలయంలో జరిగే వార్షికోత్సవాల సందర్భంగా అంగద్ తిలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారు. ప్రముఖ గాయకుల భక్తిగీతాల రికార్డును కూడా ఆయన విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా అయోధ్యలోని లతా చైక్, జన్మభూమి పథ్, శ్రింగార్ హాట్, రామ్‌కీ పైడి, సుగ్రీవ పోర్ట్, చోటి దేవ్‌కాళి ప్రాంతాల్లో యువ కళాకారులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గీతాలాపణ ఉంటాయని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తెలిపారు.
Ayodhya: ఆలయ గర్భగుడి వద్ద శ్రీరామ్ రాగ్‌సేవ కార్యక్రమం కూడా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వార్షికోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు, భక్తులకు ఆహ్వానాలు పంపామని తెలిపారు. దీంతో మరోసారి అయోధ్య మూడురోజులపాటు ఆధ్యాత్మిక శోభతో వెలుగొందనున్నది.