Avatar 3

Avatar 3: అవతార్-3 అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ ఎప్పుడంటే!

Avatar 3: జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వస్తున్న ‘అవతార్ 3’ టికెట్ బుకింగ్స్‌కు డేట్ ఖరారైంది. భారత్‌లో డిసెంబర్ 5 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తుందని అంచనా. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కిస్తున్న ‘అవతార్ 3’ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లతో భారీ అంచనాలు రేకెత్తించింది.

Also Read: Poonam Kaur: సమంత పెళ్లి వేళ సంచలనం రేపుతున్న పూనమ్ ట్వీట్?

భారత్‌లో కూడా ఈ చిత్రం పట్ల అపార ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమా భారత్‌లో డిసెంబర్ 5 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అంటే రిలీజ్‌కు పదిహేను రోజుల ముందే టికెట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అరుదైన అవకాశంతో భారత బాక్సాఫీస్ వద్ద ‘అవతార్ 3’ కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం ఇండియాలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *