Warangal Crime: వరంగల్ లో నడి రోడ్డులో వైద్యుడిపై హత్యాయత్నం జరిగింది. వరంగల్-బట్టుపల్లి మధ్య ప్రధాన రహదారిపై ఘటన చోటుచేసుకుంది. కారులో వెళ్తున్న వైద్యుడు సిద్దార్థ్ రెడ్డిపై అత్యంత దారుణంగా ఇనుపరాడ్లతో దాడి చేశారు. కారును అడ్డగించి, బయటకు లాగి దుండగులు రాడ్లతో దాడికి దిగారు. కొన ఊపిరితో ఉన్న బాధితుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారు ఎవరు..? ఎందుకు దాడి చేశారు అనే కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
రక్తపు మడుగుల్లో ఉన్న సిద్ధార్ద్‌ను గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటినా ఘటనా స్థాలానికి చేరుకుని.. కొనఊపిరితో ఉన్న బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే దాడికి పాల్పడిన వారు ఎవరు? వైద్యుడు సిద్దార్ధ్‌ను ఎందుకు చంపాలనుకున్నారు..? వ్యక్తిగత కక్ష్యలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Nita Ambani: అమెరికాలో నీతా అంబానీకి ప్రతిష్టాత్మక గౌరవం
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిద్దార్ధ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత కొద్దిరోజుల క్రితం అదే రోడ్డులో.. గంజాయి బ్యాచ్ అతిగా తిరుగుతూ వచ్చిపోయేవాళ్లపై దాడికి పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ గంజాయి బ్యాచ్ డాక్టర్‌పై దాడికి పాల్పడవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తానికి స్థానికంగా ఉంటున్న బస్తీవాసుల దగ్గర సమాచారం స్వీకరిస్తున్నారు పోలీసులు.