Crime News: కరీంనగర్‌లో దారుణం వెలుగు చూసింది. జగిత్యాల జిల్లాకు చెందిన యువతి జ్వరమొచ్చిందని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు సమాచారం. ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆమె నిద్రపోతున్నప్పుడు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఓ యువతి జ్వరంతో కరీంనగర్ సిటీలోని దీపిక హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది.
అదే హాస్పిటల్‌లో మహారాష్ట్రకు చెందిన దక్షణ్ (24) టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఎమర్జెన్సీ వార్డులో నిద్రిస్తున్న యువతికి ఆదివారం తెల్లవారుజామున దక్షణ్ మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి చేశాడు. స్పృహలోకి వచ్చాక బాధిత యువతి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హాస్పిటల్‌కు చేరుకొని, ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎమర్జెన్సీ వార్డు గదిని సీజ్ చేశారు.
ఇది కూడా చదవండి: Ranga Sudha: ప్రముఖ నటి రంగ సుధపై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు
అనంతరం సీసీ ఫుటేజీ ఆధారంగా దక్షణ్ లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారించారు. భారతదేశంలో అత్యాచారంపై భారతీయ శిక్షాస్మృతిలో (IPC 376 సెక్షన్) ప్రకారం కఠిన శిక్షలు ఉన్నాయి. వైద్య సేవలు అందించే సమయంలో రోగిపై లైంగిక దాడి జరిగితే.. అది మరింత నేరంగా పరిగణించబడుతుంది. నిందితుడికి కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా.. ఆసుపత్రి నిర్వాహకులపై కూడా నిర్లక్ష్యానికి సంబంధించి కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నది.


