Asifabad

Asifabad: మరో తల్లికి కడుపుకోత

.Asifabad: ఏమవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది. అసలు దేనికి చనిపోతున్నారు. ఏమాత్రం అర్తం కావడం లేదు. కానీ …మరణిస్తున్నారు. ఎదో ఒక చోట అనుకుంటే ఎదో లే అనుకోవచ్చు . కానీ …రోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి వార్తలు వినాల్సివస్తుంది. అందుకే తల్లి తండ్రులు ఒక కన్నేసి పెట్టండి. మీ పిల్లలు ఎలా ఉన్నారు …వారు ఉన్న చోట పరిస్థితులు ఏంటి అని…

Asifabad: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక ప్రైవేట్ డీఈడీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న తొర్రం వెంకటలక్ష్మి అనే విద్యార్థిని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఉంటోంది. అయితే ఆమె అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు..

ఇది కూడా చదవండి: study tips: పిల్లలకు చదువుపై ఆసక్తి కలిగించే సూపర్ చిట్కాలు

Asifabad: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం అందుగులపల్లికి గ్రామానికి చెందిన తొర్రం వెంకటలక్ష్మి అసిఫాబాద్ లోని శ్రీనిధి కళాశాలలో డీఈడీ చదువుతోంది. స్థానిక బీసీ పోస్ట్ మెట్రిక్ వసతిగృహంలో అడ్మిషన్ తీసుకుంది. డీఈడీ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు ఉండటంతో వారం క్రితమే హాస్టల్ కు వచ్చింది. అక్కడి భోజనం నచ్చకపోవడంతో ఎక్కువగా బయటి నుంచి పండ్లు తెచ్చుకుంటుంది. అయితే, తలనొప్పిగా ఉందని ఒక్కసారిగా కింద పడిపోయింది. సిబ్బంది 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందింది.

ఇది కూడా చదవండి: Kadapa: కడప కార్పొరేషన్‌లో పుష్ప -2 సీన్ రిపీట్…?

Asifabad: అయితే వెంకటలక్ష్మి అనారోగ్యంతో ఉన్న విషయం తమకు తెలియజేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నా కూతురు వారం క్రితమే ఇక్కడికి వచ్చింది. సిబ్బంది మాకు ఏం చెప్పలేదు.. తెలిస్తే మా బిడ్డను కాపాడుకునేవాళ్లమని విద్యార్థిని వెంకటలక్ష్మి తల్లి రోదించిన తీరు అక్కడి వారిని కన్నీళ్లు పెట్టించింది. అయితే ఆ విద్యార్థిని మృతి చెందిన సమయంలో హాస్టల్ వార్డెన్ కూడా అందుబాటులో లేరు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినా.. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లినా విద్యార్ధిని ప్రాణాలు దక్కేవని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు.

Asifabad: ఉన్నత చదువుల కోసం, లేక అందుబాటులో విద్యా సంస్థలు లేవని సమీప ప్రాంతాలకు విద్యార్థులు వెళ్లడం సర్వసాధారణం. కానీ ఓ వైపు ప్రభుత్వ హాస్టల్స్‌ లో తరుచుగా ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నారు. మరోవైపు ప్రైవేట్ హాస్టల్స్ లో ఉండి చదువుతున్నా తమ పిల్లల ప్రాణాలకు రక్షణ లేదని, ఏ క్షణంలో ఏ వార్త విన్నాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ  Hyderabad: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *