Asaduddin: షాహిద్ ఆఫ్రిది ఓ జోకర్..

Asaduddin: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ ఇటీవల భారత ప్రభుత్వం మరియు భారత సైన్యం పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఆఫ్రిదీను ఆయన “పెద్ద జోకర్” అని, “పనికిరాని వాడు” అని విమర్శించారు. అతడి గురించి మాట్లాడటం సమయం వృథా మాత్రమే అని ఒవైసీ వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ పహల్గామ్ ఘట్టన గురించి చేసిన వ్యాఖ్యలు, భారత సైన్యంపై తప్పుడు ఆరోపణలు వేయడంపై ఒవైసీ మండిపడ్డారు. ఆఫ్రిదీ భారత సైన్యాన్ని దూషించి, “భారత సైన్యం చేతగానితనంతో, వైఫల్యం కారణంగా పాకిస్థాన్ పై దాడి జరిగింది” అని పేర్కొన్నారు. ఆయన్ను ఉద్దేశించి, భారత ప్రభుత్వం తన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిసారి పాకిస్థాన్‌పై విమర్శలు చేయడమే చేస్తోంది అని ఆఫ్రిదీ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందిస్తూ, ఆఫ్రిదీ “పెద్ద జోకర్” అని విమర్శించారు. అలాగే, పాకిస్థాన్ పై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సైబర్ దాడులు మరియు సెల్ఫ్ డిఫెన్స్ కింద మిలిటరీ యాక్షన్ తీసుకోవాలని కూడా ఆయన కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీకి పాక్‌ను ఆర్థికంగా బలహీనపరిచే చర్యలు తీసుకోవాలని ఒవైసీ సూచించారు. ఈ సందర్భంగా, “మతం పేరిట అమాయకులని చంపితే ఏ దేశం కూడా చూస్తూ ఊరుకోదు” అని హెచ్చరించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *