ap news:సామూహిక లైంగిక‌దాడి ఘ‌ట‌న‌పై 24 గంట‌ల్లోనే నిందితుల అరెస్టు

ap news: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని శ్రీ స‌త్య‌సాయి జిల్లా చిల‌మత్తూరు మండ‌లంలో అత్తాకోడ‌ళ్ల‌పై జ‌రిగిన సామూహిక లైంగిక‌దాడి ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు బృందాలుగా ఏర్ప‌డి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టి 24 గంట‌లు గ‌డ‌వ‌క ముందే నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైన‌ర్లు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన రాష్ట్ర మంత్రి స‌విత.. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యార‌ని, 24 గంట‌ల్లోనే పోలీసులు నిందితుల‌ను ప‌ట్టుకున్నార‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *