Mere Husband Ki Biwi: అర్జున్ కపూర్, భూమీ ఫడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ముక్కోణ ప్రేమకథా చిత్రం ‘మేరే హజ్బెండ్ కీ బీవీ’. ఈ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఓ మోషన్ పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీని ముదస్సర్ అజీజ్ డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో ముదస్సర్ అజీట్ ‘పతీ పత్నీ ఔర్ వో, హ్యాపీ భాగ్ జాయేగీ, ఖేల్ ఖేల్ మే’ వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తీశారు. ఈ సినిమా ప్రకటన వచ్చి మూడేళ్ళు గడిచినా… ఇప్పటికి జనం ముందుకు వస్తోంది. అర్జున్ కపూర్ చివరగా ‘సింఘం అగైన్’లో ప్రతినాయకుడిగా నటించగా, రకుల్ ప్రీత్ సింగ్ ‘దే దే ప్యార్ దే -2’ తర్వాత నటించిన సినిమా ఇదే! ఇక భూమి ఫడ్నేకర్ ఓ వెబ్ సీరిస్ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. అలానే ‘ద రాయల్స్’ అనే మరో వెబ్ సీరిస్ లో ఇషాన్ ఖట్టర్ సరసన నటిస్తోంది.
ARJUN KAPOOR – RAKUL PREET SINGH – BHUMI PEDNEKAR: ‘MERE HUSBAND KI BIWI’ QUIRKY MOTION POSTER UNVEILS… 21 FEB 2025 RELEASE… #ArjunKapoor, #RakulPreetSingh and #BhumiPednekar star in the comedy #MereHusbandKiBiwi, which arrives in *cinemas* on 21 Feb 2025.
Directed by… pic.twitter.com/hjSJhUsLHk
— taran adarsh (@taran_adarsh) January 2, 2025