Kitchen Safety Tips: ఈ మధ్య కాలంలో ఫోన్ లేనిదే ఏ పని కాదు. కాసేపు ఫోన్ లేకపోతే కొంతమందికి ఏం తోచదు. అంతలా ఫోన్‌కు అడిక్ట్ అయిపోతున్నారు. ఇక గంటల తరబడి టాయిలెట్‌లో కూర్చుని మొబైల్ ఫోన్ వాడకూడదని అంటున్నారు. అదేవిధంగా వంటగదిలో మొబైల్ ఫోన్‌లను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది వంటను నాశనం చేస్తుంది. కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా దారి తీస్తుంది. మొబైల్ ఫోన్ చూస్తూ వంట చేయడానికి వెళితే.. మీ ఫోకస్ మొత్తం మొబైల్ పైనే ఉంటుంది. అప్పుడు వంట రుచి చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబైల్ ఫోన్‌ను పక్కన పెట్టి మీరు చేస్తున్న పనిపై దృష్టి పెట్టాలి.
మొబైల్ ఫోన్ క్రేజ్ ఎంతగా వ్యాపించిందంటే కొంతమంది మొబైల్ ఫోన్లు చూస్తూ కూరగాయలు కోయడం లేదా వంట చేయడం వంటివి చేస్తున్నారు. అందువల్ల దృష్టి మొబైల్ ఫోన్ పై కేంద్రీకృతమై ఉన్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు చేతికి కత్తి గాట్లు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా చేయి కాలే చాన్సులు కూడా ఉన్నాయి. కాబట్టి వంటగదిలో మీ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించవద్దు.
అంతే కాదు వంట చేస్తున్నప్పుడు ఫోన్‌ని చూస్తే.. అది మీ చేతిలో నుండి జారి నీటిలో లేదా వేడి ఆహారంలో పడే అవకాశం ఉంది. అలాగే నూనె, ఇతర పదార్థాలు మొబైల్ ఫోన్‌పై పడవచ్చు. ఇది మీ మొబైల్ ఫోన్‌కు హాని కలిగించడమే కాకుండా ఖర్చులను కూడా పెంచుతుంది.
వంట చేసేటప్పుడు శుభ్రత, పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. కూరగాయలు వండేటప్పుడు లేదా కోసేటప్పుడు మీ మొబైల్ ఫోన్‌ను తాకినట్లయితే దానిపై ఉన్న బ్యాక్టీరియా ఆహారంలోకి చేరే అవకాశం ఉంది.
మొబైల్ ఫోన్ నుండి వెలువడే రేడియేషన్ చాలా ప్రమాదకరమైనది. అది భారీ పేలుడుకు కారణమవుతుంది. ఫోన్ నుండి వెలువడే రేడియేషన్ వల్ల గ్యాస్ లీక్ అయ్యే సందర్భాల్లో పేలుడు సంభవించే అవకాశం ఉంది. అందువల్ల ప్రమాదాలను నివారించడానికి వంటగదిలో మొబైల్ ఫోన్‌లను ఉపయోగించకపోవడమే మంచిది. వంట చేసేటప్పుడు మీ మొబైల్ ఫోన్‌ను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించండి.